ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్

ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్

న్యూఢిల్లీ : మార్కెట్లో మారుతీ సుజుకీ కార్ల హవా అంతా ఇంతా కాదు. పోటీపడి మరీ ఆ దిగ్గజ కార్లు టాప్ ప్లేస్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండే ఆల్టోను తన తోబుట్టువు స్విఫ్ట్ బీట్ చేసింది.  ఏప్రిల్  నెలలో మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా స్విఫ్ట్ నిలిచింది. 10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో  ఏడు మారుతీ సుజుకీవే చోటు దక్కించుకున్నాయి. మిగిలిన మూడు స్థానాలు మారుతీ సుజుకీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్లు ఉన్నాయి. సియామ్ తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ కార్లు 23,802 యూనిట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. ముందటేడాది  ఇదే నెలలో  ఇవి 15,661  యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఈ  ఏడాదికి 51.98 శాతం అమ్మకాలను పెంచుకుంది ఈ మోడల్.  

 

ఆల్టో మోడల్ 22,549 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి 35.97 శాతం. 2016 ఏప్రిల్ లో ఆల్టో నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్. ఆ సమయంలో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేంది. ప్రస్తుతం ఆల్టోను స్విఫ్ట్ బీట్ చేసింది. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బెలానో మూడో స్థానంలో 17,530 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది.  గతేడాది 8వ స్థానంలో ఉండగా.. ఇది ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చేసింది. వాగన్ ఆర్ 4వ స్థానం, హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10లు, ఐదు ఆరు స్థానాలు, మారుతీ సుజుకీ విటారా బ్రిజా 7వ స్థానం, హ్యుందాయ్ క్రిటా 8వ స్థానం, మారుతీ సుజుకి డిజైర్ టూర్ 9వ స్థానం, సెలెరియో 10వ స్థానం దక్కించుకున్నాయి. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top