అమ్మకాల ఒత్తిడి:చివరికి నష్టాలే


ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లోముగిశాయి. లాభాల స్వీకరణతో ఆరంభంనుంచీ నష్టాలతో కొనసాగిన మార్కెట్లలో  వారాంతలో నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 153 నష్టంతో 311138వద్ద,  నిప్టీ 55పాయింట్ల నష్టంతో 95775 వద్ద ముగిసింది.  తద్వారా కీలకమైన 9,600 దిగువన ముగిసింది.  దాదాపు అన్ని రంగాల్లోను అమ్మకాలు కొనసాగాయి.  అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో రియల్టీ, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు క్షీణించాయి.  ఫార్మా స్వల్పంగా లాభపడగా  మిడ్‌క్యాప్స్‌ బాగా నష్టపోయింది.  ఐషర్‌ మోటార్స్‌,  బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌ తదితర బ్లూచిప్‌ షేర్లు నష్టపోయాయి.  

రియల్టీ షేర్లలో ఒబెరాయ్‌, డెల్టాకార్ప్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, హెచ్‌డీఐఎల్‌, యూనిటెక్, శోభా పతనమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ తప్ప బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.డ ఇక పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో ఆంధ్రాబ్యాంక్‌, కెనరా, యూనియన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌, ఓబీసీ, సిండికేట్‌, స్టేట్‌బ్యాంక్‌, బీవోబీ, పీఎన్‌బీ, ఐడీబీఐ  నష్టపోయాయి. . ఆర్‌కాం, రిలయన్స్‌ లాభపడ్డాయి.

అటు డాలర్‌ మారకంలో రుపాయి 0.11పైసలు లాభపడి రూ. 64.48వద్ద ఉంది. బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్‌మార్కెట్‌ లో స్థిరంగానే ఉన్నాయి.పది గ్రా. పుత్తడి రూ.121 పుంజుకుని రూ.28, 750 వద్ద ఉంది. 


కాగా రంజాన్‌  పర్వదినం  సందర్భంగా  సోమవారం మార్కెట్లకు  సెలవు.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top