చిన్న జనరేటర్లపై కిర్లోస్కర్ దృష్టి

చిన్న జనరేటర్లపై కిర్లోస్కర్ దృష్టి


రూ. 500 కోట్ల వూర్కెట్లో 15 శాతం వాటా లక్ష్యం

ఈ ఏడాది జనరేటర్ల వ్యాపారంలో 10 శాతం వృద్ధి అంచనా

కోయెల్ గ్రీన్‌గా వూరిన కిర్లోస్కర్ గ్రీన్

కిర్లోస్కర్ ఆరుుల్ ఇంజనీర్స్

వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ ఎం నివుకర్


 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనరేటర్ల తయూరీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కిర్లోస్కర్ ఆరుుల్ ఇంజన్స్ ఇప్పుడు చిన్న జనరేటర్ల వూర్కెట్‌పై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా కోయెల్ బ్రాండ్ పేరు మీద ప్రవేశపెట్టిన 2.1 కేవీ, 5 కేవీ సావుర్థ్యం గల జనరేటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు కిర్లోస్కర్ ఆరుుల్ ఇంజనీర్స్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ ఎం నివుకర్ తెలిపారు. కిర్లోస్కర్ గ్రీన్ బ్రాండ్ పేరును కోయెల్ గ్రీన్‌గా వూర్చిన వివరాలను తెలియుచేయుడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో వూట్లాడుతూ 2.1 కేవీ సావుర్థ్యం గల జనరేటర్ విలువను రూ. 70,000, 5 కేవీ జనరేటర్ విలువను రూ. 1.60 లక్షలుగా నిర్ణరుుంచినట్లు తెలిపారు.



దేశవ్యాప్తంగా చిన్న జనరేటర్ల వూర్కెట్ విలువ సువూరు రూ. 500 కోట్లుగా ఉందని, ఇందులో కనీసం 25 శాతం వూర్కెట్ వాటాను చేజి క్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం దేశీయు జనరేటర్ వూర్కెట్ పరివూణం సువూరుగా రూ. 6,000 కోట్లుగా ఉంటే అందులో 34 శాతం వాటాతో కిర్లోస్కర్ మొదటి స్థానంలో ఉన్నట్లు సంజీవ్ తెలిపారు. గతేడాది కిర్లోస్కర్ గ్రూపు రూ. 2,300 కోట్ల ఆదాయూన్ని ఆర్జించిందని, ఈ ఏడాది 10 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.



వచ్చే ఏ డాది కంపెనీ ఆదాయుంలో 10 శాతం చిన్న జనరేటర్ల నుంచే సవుకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ 15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సవూధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 24 గంటల విద్యుత్ సరఫరా ఉండే పైలట్ ప్రాజెక్టుకింద ఎంపికైనప్పటికీ ఆ ప్రభావం జనరేటర్ల అవ్ముకాలపై ఉండదని సంజీవ్ స్పష్టం చేశారు. అసలు విద్యుత్ కోతలే లేని అమెరికానే జనరేటర్ల అవ్ముకాలకి అతిపెద్ద వూర్కెట్ అని, విద్యుత్ ఎప్పుడు పోతుందో తెలియుదు కాబట్టి ప్రతీ ఒక్కరు వుుందు జాగ్రత్తగా జనరేటర్లను కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top