గ్లోబల్‌ ఫండ్స్‌ ఎవరి కోసం..?

గ్లోబల్‌ ఫండ్స్‌ ఎవరి కోసం..?


ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశం కల్పించే వేదికే గ్లోబల్‌ ఫండ్స్‌. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఏ గ్లోబల్‌ మార్కెట్‌లోనైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు.



ఫండ్స్‌తో డైవర్సిఫికేషన్‌..

పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు గ్లోబల్‌ ఫండ్స్‌ ఉపయోగపడతాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మార్కెట్‌ విస్తృతి పెరుగుతుంది. అప్పుడు మనకు నచ్చిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా గ్లోబల్‌ మార్కెట్లన్నీ ఒకే దిశలో పయనించవు. కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. అందుకే గ్లోబల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మార్కెట్ల అస్థిరతల నుంచి పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవచ్చు.

ప్రయోజనాలు:

మనకు అనువైన గ్లోబల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చెయొచ్చు.

దేశీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఒక్కో దేశపు మార్కెట్లు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో రిస్క్‌ ప్రభావం తక్కువగా ఉంటుంది.



ప్రతికూలతలు:

కరెన్సీ ప్రభావం: ఫండ్‌ పనితీరుతో నిమిత్తం లేకుండా గ్లోబల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిటర్న్స్‌ను ఆయా దేశాల కరెన్సీ బాగా ప్రభావితం చేస్తుంది.



ప్రాంతీయ రాజకీయాలు: ఇన్వెస్ట్‌ చేసే ప్రాంతాల్లో ఏవైనా రాజకీయ సమస్యలు ఉత్పన్నమైతే వాటి ప్రభావం గ్లోబల్‌ ఫండ్స్‌ రాబడిపై ప్రతికూలంగా ఉండొచ్చు. అలాగే ఆయా దేశాల్లో వరదలు, భూకంపాలు వంటి ఇతర   ప్రమాదాలు సంభవించినా కూడా వాటి ప్రభావం ఫండ్‌ రాబడిపై పడొచ్చు.



ఈ విషయాలు మరువొద్దు

ఇన్వెస్ట్‌ చేసే ముందు ఆ ఫండ్స్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ ఉండాలి. ఈ విధంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆ ఫండ్‌ మనకు సరిపోతుందా? లేదా? అని ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఫండ్‌ ఎంటర్, ఎగ్జిట్‌ లోడ్‌ తదితర చార్జీల వివరాలు తెలుసుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top