11వేల మందిని బయటికి పంపేసిన ఇన్ఫీ

11వేల మందిని బయటికి పంపేసిన ఇన్ఫీ - Sakshi

న్యూఢిల్లీ : ఆటోమేషన్.. ఉద్యోగులకు ఏ స్థాయిలో ప్రమాదం చూపుతుందో ఇన్ఫోసిస్ చెప్పకనే చెప్పేసింది.  ఆటోమేషన్ కారణంతో ఈ ఏడాది 11వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీ నుంచి బయటికి పంపేశామని ఇన్ఫోసిస్ నేడు(శనివారం) బెంగళూరులో జరిగిన 36వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పింది. అయితే ఆటోమేషన్, యూటిలైజేషన్, ప్రొడక్టివిటీ మెరుగుదలతో పూర్తిస్థాయి ఉద్యోగి ఆదాయం 1.2 శాతం పెరిగినట్టు తెలిపింది. అదేవిధంగా ఇటీవల మీడియా సృష్టిస్తున్న రూమర్లపై కూడా ఇన్ఫోసిస్ క్లారిటీ ఇచ్చింది. ప్రమోటర్లకు, కంపెనీ బోర్డుకు ఎలాంటి సమస్యలేదని తెలిపింది. 

 

నేడు జరిగిన వార్షిక ఏజీఎంలో కీలక విషయాలు:

 

► 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు 14.75 రూపాయల ఫైనల్ డివిడెంట్ ను ప్రకటించినట్టు ఇన్ఫీ చెప్పింది. దీంతో సుమారు 4,061 కోట్ల నగదు కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు పేర్కొంది. దీనిలో ట్రెజరీ షేర్లపై చెల్లించే డివిడెంట్ లేదు.       కార్పొరేట్ డివిడెంట్ పన్నును కలిపారు.  

 

► అదేవిధంగా 2018 ఆర్థిక సంవత్సరంలో షేర్ హోల్డర్స్ కు రూ.13వేల కోట్లు లేదా రూ.12,899 కోట్లు చెల్లించాలని బోర్డు నిర్ణయించినట్టు ఇన్ఫీ చెప్పింది. ఇది డివిడెంట్లా లేదా బై బ్యాకా అనేది తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.

 

► 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫీ వద్ద రూ.12,222 కోట్ల నగదు, నగదు సమానవైనవి ఉన్నట్టు తెలిపింది. ఇది 2016 కంటే తక్కువే. 2016లో ఇవి రూ.24,276కోట్లుగా ఉన్నాయి. తమ దగ్గర ఎక్కువ నగదు ఉందని అనడం నిరాధారంగా పేర్కొంది. అయితే ముందటేడాది కంటే ఈ ఏడాదికి ఇన్ స్టిట్యూషన్ల వద్ద  ఉంచిన డిపాజిట్లు పెరిగాయి. 2016లో కంపెనీ డిపాజిట్లు రూ.4,900కోట్లు కాగ, అవి ఈ 2017 మార్చికి రూ.6,931కోట్లకు పెరిగాయి. 

 

► కంపెనీ చైర్మన్ శేషసాయికి ఇదే చివరి ఏజీఎం. వచ్చే ఏడాది మే నెలలో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. తన మిగతా పదవీ కాలాన్ని కార్పొరేట్ ప్రమాణాలకు అనుగుణంగా షేర్ హోల్డర్స్ విలువను పెంచడానికే కృషిచేస్తానన్నారు. 

 

► ఇటీవల మీడియాలో వస్తున్న రిపోర్టులను ఇన్ఫీ కొట్టిపారేసింది. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపింది. 

 

► ఏఐ ప్లాట్ ఫామ్ పై 70కి పైగా క్లయింట్స్ ఉన్నారని, కొత్త ప్లాట్ ఫామ్ లే తమకు క్యూ1లో రెవెన్యూలిస్తాయని కంపెనీ పేర్కొంది. తమ యుటిలైజేషన్ 81.7శాతముందని, ఇది దశాబ్దంలోనే అత్యధికంగా వెల్లడించింది. గత 12 ఏళ్లలో అత్యధిక క్లయింట్ల సంతృప్తి సాధించామని చెప్పింది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top