హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా ఉద్యోగాల కోత

హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా ఉద్యోగాల కోత

ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి హెచ్డీఎఫ్సీ. ఈ బ్యాంకు వరుసగా రెండో త్రైమాసికంలోనూ భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. వినియోగదారులను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ అభివద్ధి బాటపట్టడంతో బ్యాంకు బ్రాంచుల విస్తరణ మందగించినట్టు తెలిసింది. ఈ బ్రాంచుల విస్తరణ మందగించడంతో ఈ క్వార్టర్లోనూ భారీగా ఉద్యోగాల కోత పెట్టినట్టు వెల్లడైంది. 2016 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో 90,421గా ఉన్న బ్యాంకు ఉద్యోగులు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో 84,325గా ఉన్నారు. అంటే దాదాపు 6096 మంది ఉద్యోగులను బ్యాంకు బయటికి సాగనంపినట్టు వెల్లడైంది. ఈ తగ్గింపు ఈ క్వార్టర్లోనే అత్యధికమని తెలిసింది.

 

2016 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లోనూ బ్యాంకు 4581 మంది ఉద్యోగులను తగ్గించింది. అట్రిక్షన్ పేరుతో బయటికి వెళ్లిపోయిన వారిలో కొత్త స్టాఫ్ను భర్తీ చేసుకోవడం లేదని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో తమ సామర్థ్యాలను రీబ్యాలెన్స్ చేసుకుంటున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. అదేవిధంగా ఉద్యోగుల ఖర్చులను కూడా బ్యాంకు తగ్గించుకుంది. ఉద్యోగులను తగ్గించుకున్న విషయాన్ని సుక్తాంకర్ కూడా తెలిపారు. గత కొన్నేళ్లలో కనీసం 300 నుంచి 400 బ్రాంచులను ప్రారంభిస్తే, ఈ ఏడాది కేవలం 195 బ్రాంచులను మాత్రమే ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కొత్త బ్రాంచుల ఏర్పాటు మందగించిందని,  ఉద్యోగుల సంఖ్యలోనూ ముందస్తున్న వృద్ధి లేదని, తగ్గిపోయిందని చెప్పారు. అయితే ఉద్యోగులను తగ్గించుకునే ప్రభావం బ్యాంకు వద్దిపై పడదని స్పష్టంచేశారు. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top