ప్రతిరోజూ తగ్గుతున్న బంగారం ధర!

ప్రతిరోజూ తగ్గుతున్న బంగారం ధర! - Sakshi


హైదరాబాద్: బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. పది రోజుల నుంచి ప్రతి రోజూ ధర తగ్గుతోంది. 24 కేరెట్లు పది గ్రాముల ధర ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 15 వందల రూపాయల వరకు తగ్గింది. ఈ నెలలో రెండు రోజులు తప్ప ప్రతిరోజూ ధర కొద్దోగొప్పో తగ్గుతూ వచ్చింది.  శుక్రవారంతో పోల్చితే ఈరోజు కూడా మూడు వందల రూపాయల వరకు తగ్గింది.



ఈ నెల 19వ తేదీ శుక్రవారం హైదరాబాద్లో   పది గ్రాముల 24 కేరెట్ల బంగారం ధర  27 వేల రూపాయలు ఉండగా, ఈరోజు 26వేల 800 రూపాయలకు తగ్గింది. ఈ నెలలో ఇప్పటి వరకు ధర 1480 రూపాయలు తగ్గింది. ఈ నెల 1వ తేదీన పది గ్రాములు 28వేల 280 రూపాయలు ఉంది. కొంచం కొంచం తగ్గుతూ ఈరోజు 26వేల 800 రూపాయలకు పడిపోయింది.

**

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top