ప్రతిరోజూ తగ్గుతున్న బంగారం ధర!
హైదరాబాద్: బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. పది రోజుల నుంచి ప్రతి రోజూ ధర తగ్గుతోంది. 24 కేరెట్లు పది గ్రాముల ధర ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 15 వందల రూపాయల వరకు తగ్గింది. ఈ నెలలో రెండు రోజులు తప్ప ప్రతిరోజూ ధర కొద్దోగొప్పో తగ్గుతూ వచ్చింది. శుక్రవారంతో పోల్చితే ఈరోజు కూడా మూడు వందల రూపాయల వరకు తగ్గింది.
ఈ నెల 19వ తేదీ శుక్రవారం హైదరాబాద్లో పది గ్రాముల 24 కేరెట్ల బంగారం ధర 27 వేల రూపాయలు ఉండగా, ఈరోజు 26వేల 800 రూపాయలకు తగ్గింది. ఈ నెలలో ఇప్పటి వరకు ధర 1480 రూపాయలు తగ్గింది. ఈ నెల 1వ తేదీన పది గ్రాములు 28వేల 280 రూపాయలు ఉంది. కొంచం కొంచం తగ్గుతూ ఈరోజు 26వేల 800 రూపాయలకు పడిపోయింది.
**