దేశీయ కరెన్సీ పేపర్ ఉత్పత్తి షురూ


హోషంగాబాద్: దేశీయంగా కరెన్సీ పేపర్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం పెద్ద నోట్ల ప్రింటింగ్‌కు దిగుమతి చేసుకున్న కాగితాన్ని వాడుతున్నారని, ఈ యూనిట్ ప్రారంభంతో ఆ నోట్లకు దేశీయ పేపర్‌ను ఉపయోగించనున్నారన్నారు. ఇక్కడి సెక్యూరిటీ పేపర్ మిల్‌లోని ఈ కొత్త యూనిట్ ఏడాదికి 6 వేల టన్నుల పేపర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైసూర్ ప్రింటింగ్ ప్రెస్‌లో 12 వేల టన్నులు సామర్థ్యంతో ఇలాంటి యూనిట్‌ను ఈ ఏడాది చివరికి ప్రారంభిస్తామని జైట్లీ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులతో రానున్న ఏళ్లలో రూ. 1,500 కోట్ల విదేశీ మారకం ఆదా కానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top