బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ నుంచి బ్లూ-సీ స్మార్టీ

బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ నుంచి బ్లూ-సీ స్మార్టీ


బ్లూ-సీ స్మార్టీ పేరుతో బ్లూమ్యాక్స్ ఇంపెక్స్ (ఇండియా) తన తాజా మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆఫర్ ధర రూ.3,990. తెలుపు, నలుపు రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ‘స్మార్టీ’ బ్యాక్ కవర్లు పసుపు, లేత ఎరుపు రంగు (గులాబీ)ల్లో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. కిట్‌క్యాట్ 4.4.2తో కూడిన ఈ 3జీ ఆండ్రాయిడ్ ఫోన్ , లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేకు వినియోగించే స్క్రీన్ టెక్నాలజీ కలిగిఉంది.



3.5 అంగుళాల ఐపీఎస్ టెక్నాలజీ స్కీన్ ఉన్న ఈ మొబైల్... డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 2జీబీ మెమరీ, 256 ఎంబీ ర్యామ్,  2 ఎంపీ వెనుకభాగం కెమెరా, 0.3 ఎంపీ ముందు భాగం కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ధర తక్కువలోనే మల్టీ టాస్క్ స్క్రీన్ యాప్ ఫంక్షన్ సదుపాయం దీని సొంతమని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top