‘సబ్‌సే సస్తే 6దిన్‌’లో బిగ్‌ బజార్‌ భారీ ఆఫర్లు

‘సబ్‌సే సస్తే 6దిన్‌’లో  బిగ్‌ బజార్‌ భారీ ఆఫర్లు


హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిగ్‌బజార్‌ ‘సబ్‌సే సస్తే 6దిన్‌’ పేరుతో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బిగ్‌ బజార్‌ స్టోర్లలో భారీ తగ్గింపులతో విక్రయాలను సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా 6 కిలోల రిన్‌ డిటర్జెంట్‌ ప్యాక్‌ను రూ.278కి, 10కిలోల గోల్డెన్‌ హార్వెస్ట్‌ ఆటా రూ.207 రూపాయలకే విక్రయిస్తున్నట్టు బిగ్‌బజార్‌ ఓ ప్రకటనలో తెలిపింది.



రూ.2,000 అంతకంటే ఎక్కువ కొనుగోలుపై రూ.400 క్యాష్‌బ్యాక్, యాక్సిక్‌ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం తగ్గింపు, పేటీఎం వినియోగదారులకు నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించే సదుపాయం, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నట్టు వెల్లడించింది. రద్దీ నేపథ్యంలో భారీ క్యూలను నివారించేందుకు ఈ సారి క్విక్‌ చెక్‌ అవుట్‌ విధానాన్ని ఆచరణలో పెట్టినట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top