విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక!

విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక!


గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. 120–140 చ.అ. ఉండే గదిలో 1 టన్ను, 150–180 చ.అ. ఉండే గదిలో 1.5 టన్నులు, 180–240 చ.అ. విస్తీర్ణం ఉండే గదిలో 2 టన్నుల ఏసీ సరిపోతుంది. ఒకవేళ పడక గది దక్షిణం, పశ్చిమ దిశల్లో ఉంటే ఎండ ఎక్కువుంటుంది కాబట్టి సాధారణం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి. టన్ను ఏసీ బదులు 1.5 టన్ను ఏసీని ఎంచుకోవటం ఉత్తమం.



ఒకవేళ 3–4 నెలలు... రోజులో 8–10 గంటల పాటు ఏసీని వినియోగిస్తే కనీసం త్రీ స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఏసీని తీసుకోవటం ఉత్తమం. ఒకవేళ 5–7 నెలల పాటు వినియోగిస్తే మాత్రం ఫైవ్‌ స్టార్‌ ఏసీని తీసుకోవటం మేలు.



సాక్షి, హైదరాబాద్‌: ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. కూలరో లేక ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ)ని కొనడంలో బిజీ బిజీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంటికి ఎలాంటి ఏసీని కొనాలో చాలా మందికి తెలియదు. బ్రాండ్‌ ఎంపిక బెస్టా? లేక స్టార్‌ రేటింగ్‌ ముఖ్యమా? అని నిపుణులనడితే.. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక ఉంటుందంటున్నారు.



ఇళ్లల్లో ఎక్కువగా వినియోగించే ఏసీలు విండో, స్లి్పట్‌ రకాలే. అయితే ప్రస్తుతం విండో కంటే స్లి్పట్‌ ఏసీలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పెద్దగా చప్పుడు లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే దీని ప్రత్యేకత. డైకిన్, ఎల్‌జీ, శామ్‌సంగ్, వోల్టాస్, బ్లూస్టార్, క్యారియర్, లాయిడ్, ఓ జనరల్, మిట్సుబిషి, వర్ల్‌పూల్‌ వంటి ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటాపోటీగా ఆయా సంస్థలు సరికొత్త సదుపాయాలతో మార్కెట్లో రెడీగా ఉన్నాయి. ప్రారంభ ధరలు రూ.25 వేల నుంచి ఉన్నాయి.



కొనాలంటే స్టార్‌ ఉండాల్సిందే..

ఏసీ కొనాలంటే కొనుగోలుదారులు ముందుగా చూసేది స్టార్‌ గుర్తులే. ఎందుకంటే ఎనర్జీ ఎఫిసియెన్సీ అనేది ఎంత విద్యుత్‌ను ఆదా చేస్తుందనే తెలియజేస్తుంది మరి. అందుకే ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా స్టార్‌ రేటింగ్‌ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఏసీపై ఒక  స్టార్‌ ముద్రించి ఉంటే 5 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని అర్థం. స్టార్ల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్‌ ఆదా కూడా పెరుగుతుంది. ఒక్కో స్టార్‌ గుర్తు పెరుగుతుంటే ధర కూడా రూ.2,500 పెరుగుతుంది. ఫైవ్‌ స్టార్‌ స్లి్పట్‌ ఏసీతో పోల్చుకుంటే ఇన్వర్టర్‌ ఏసీ ధర 20 శాతం అధికంగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top