Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం బిజినెస్కథ

భారీగా తగ్గిన ఇన్ఫోసిస్‌ నియామకాలు

Sakshi | Updated: February 14, 2017 01:17 (IST)
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్‌ నియామకాలు

హైదరాబాద్‌: ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయ్‌. ప్రతి ఏడాది ఇన్ఫోసిస్‌ 20 వేల నుంచి 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 6,000 మందికే ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ ఐటీ విభాగం కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. వివిధ కారణాల వల్ల 7,000 మంది ఇన్ఫోసిస్‌ను వదిలివెళ్లారని, దీంతో హైరింగ్‌ విషయంలో ప్రతికూల వృద్ధి నమోదైందని వివరించారు. నగరంలో ఇటీవల జరిగిన బయో ఏసియా సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి ఈ వివరాలు తనకు చెప్పారని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ 33 ఏళ్ల చరిత్రలో ఇలా రుణాత్మక వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారని నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ జయేశ్‌ రంజన్‌ చెప్పారు. ఇక్కడ జరిగిన ఇండియాసాఫ్ట్‌–2017 కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

సీటుకో రేటు!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC