జన సమరంలో జగన్ వెంట సాగుదాం


 చెల్లూరు(రాయవరం) : ప్రజాసమస్యలపై నిత్యం పోరాట యోధుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ప్రజలపై ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం రాత్రి రాయవరం మండలం చెల్లూరులో ఎమ్మెల్సీగా ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహిం చారు. పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామన్నచౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారన్నారు.  

 

 ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బూటకపు హామీలతో అందరినీ మోసగించారన్నారు. 13జిల్లాల్లో 17లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలతో రాజకీయాలు చేస్తున్నారని, రైతులు అయినకాడికే ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. గృహ నిర్మాణానికి దాదాపు నీళ్లొదిలారన్నారు.

 

 నీతి, నిజాయితీలకు నిలువుటద్దం ‘బోస్’

 ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ నీతి, నిజాయితీ, విలువలకు నిలువుటద్దం అని జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు  ప్రశంసించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ జెడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, నీటి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ నేతలు కర్రి పాపారాయుడు, సిరిపురపు శ్రీనివాసరావు, మిందిగుదిటి మోహన్, నక్కా రాజబాబు,  ఆర్.వి.వి.సత్యనారాయణచౌదరి, బొడ్డపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడే వ్యక్తిగా బోస్‌ను కొనియాడారు. బోస్ పరిపాలనాదక్షుడని, మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన బోస్ జిల్లాకే గర్వకారణంగా పేర్కొన్నారు. అనంతరం బోస్‌ను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పూల కిరీటం, గజమాల, దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

 

 అలాగే పలు శెట్టిబలిజ సంఘాలు బోస్‌ను సత్కరించాయి.ఈ కార్యక్రమంలో కె.గంగవరం ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పాలిక రాఘవగోవిందు, సత్తి సత్యవతిరామచంద్రారెడ్డి, అంపోలు సాయిలక్ష్మి, మేడపాటి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, కామిరెడ్డి తాతాజీ, సర్పంచ్‌లు వాసంశెట్టి అనంతలక్ష్మి రాధాకృష్ణ, పరంశెట్టి వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి(చినకాపు), సత్తి ఈశ్వరరెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సత్తి వీర్రెడ్డి, సత్తి శంకరరెడ్డి,కట్టా సూర్యనారాయణ, పాలిక గోవిందు, గాదంశెట్టి శ్రీధర్, వి.లక్ష్మీనారాయణరెడ్డి, వల్లూరి రామకృష్ణ, పెంకే వెంకట్రావు, సత్తి వెంకటరెడ్డి, చిక్కాల శ్రీరాములు, దేవు శివానందం, వైట్ల వెంకటకృష్ణారావు, నైట్ శ్రీను, టేకి సాయి, కుక్కల శ్రీనివాస్, మేడిశెట్టి నరేష్‌కుమార్, రాయుడు ప్రసాద్, చోడె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top