మాటలతో మాయ చేస్తున్నారు

మాటలతో మాయ చేస్తున్నారు - Sakshi


టీడీపీ పాలనపై వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని ధ్వజం

 

హైదరాబాద్: చంద్రబాబు వంద రోజుల పాలనలో పురోగతిపై శ్వేతపత్రం విడుదల చే యాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ వంద రోజు ల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని పే ర్కొంటూ.. తాము ఫలానా పని చేశామని అధికారపక్షం చెప్పగలదా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అని ఆయన సవాలు విసిరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలపై మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెబుతుంటే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం మరోవైపు మద్యాంధ్రప్రదేశ్ అంటున్నారని విమర్శించారు. బెల్ట్‌షాపుల రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేస్తే.. యనమల మాత్రం సెప్టెంబర్ నెలాఖరు కు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ‘వ్యాట్’ వసూళ్లు రావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ ముగిసేనాటికి రూ.2,314.20 కోట్ల మేరకు రావాల్సిన వసూళ్లు రూ.1,805.13 కోట్లకే ఎందుకు పరిమితమయ్యాయని యనమల ప్రశ్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం తగ్గడానికి వీల్లేదని మంత్రి తాఖీ దులిచ్చారని అన్నారు.



మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఖజానాకు శరణ్యమని మంత్రి చెప్ప డం ప్రజలను ఫుల్లుగా తాగండని సందేశమివ్వడమేనన్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించా రన్నారు. 2003 జనవరిలోనే 40 వేలకుపైగా బెల్ట్‌షాపులుండేవి. ఇపుడు మళ్లీ అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయాన్ని సమీక్షిస్తూ పెంచుకునే యత్నం చేస్తున్నారన్నారు.  రైతుల రుణమాఫీ గురించి ఎన్నికల్లో చెప్పిందొకటి, ఇపుడు చేస్తున్నది మరొకటని, ఆర్‌బీఐ గురించిగానీ, కోట య్య కమిటీ వేస్తామనిగానీ అపుడు చెప్పలేదని అన్నారు. రుణమాఫీ కోసం సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఓ సంస్థను ఏర్పాటు చే యడమెందుకు? రుణాలన్నీ కట్టేయమని చంద్రబాబు ఒక్కమాట చెబితే చాలు ఆయనే చెల్లిస్తారని సలహాఇచ్చారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top