ఓటడిగే హక్కు వైఎస్సార్ మజ్దూర్‌కే ఉంది

ఓటడిగే హక్కు వైఎస్సార్ మజ్దూర్‌కే ఉంది - Sakshi


అధికారంలోకి రాగానేఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను

బలపరచాలి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి


 

  విజయవాడ (గాంధీనగర్) : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఓటడిగే హక్కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు మాత్రమే ఉందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో వైఎస్సార్ యూనియన్‌కు కార్మిక శాఖ టేబుల్ ఫ్యాన్‌ను ఎన్నికల గుర్తుగా కేటాయించిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క సంతకంతో 9,600 మంది కార్మికులను పర్మినెంట్ చేశారన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు రూ. 250 కోట్లు కేటాయించి ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని రిలయన్స్‌కు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు ఇచ్చేందుకు కుతంత్రాలు చేస్తోందన్నారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ స్థలాన్ని బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం పేరుతో కార్మికుల వేతనాల్లోంచే రూ.100 వసూలు చేసిన పాపం చంద్రబాబుదేనన్నారు.



 కార్మికుల సంక్షేమం కోసం..

 కార్మికుల సంక్షేమం కోసం సత్వరమే చేయాల్సిన తొమ్మిది కార్యక్రమాలను నవరత్నాల పేరిట అమలు చేయాలని వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ నిర్ణయించిందని గౌతంరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే హామీతో తమ యూనియన్ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి చెప్పి, సింగిల్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. డ్రైవర్‌కు కండక్టర్ బాధ్యతలు తప్పిం చటం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించటా నికి వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని వివరించారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ను బలపరచాలని కోరారు. యూనియన్ రీజియన్ కార్యదర్శి డీవీఎస్ బాల సుబ్రహ్మణ్యం, ఎన్నికల కన్వీనర్ పి.రవికాంత్, కె.అరుణ్‌కుమార్, జీకే బాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top