వైఎస్సార్ విద్యుత్ యూనియన్‌ను బలోపేతం చేయాలి


డిస్కం నాయకులు రమేష్, బాలాజీ



 నెల్లూరు (రవాణా): సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతం చేయాలని డిస్కం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, బాలాజీ పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్‌లో ఆదివారం నెల్లూరు రీజనల్ వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.



వారు మాట్లాడుతూ డిస్కం పరిధిలో నిత్యం విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల రోజుల పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. మృతుల సంఖ్య తగ్గిం చేందుకు యూనియన్ పరంగా కృషి చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఏడాదికి రూ. 1000 చెల్లిస్తే ప్రమాదాల్లో మరణించిన కుటుంబీకులకు బీమా కింద రూ. 20 లక్షలు పరి హారం ఇచ్చేందుకు ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ ముందుకు వచ్చాయన్నారు. 2004 నుంచి రావాల్సిన జీపీఎఫ్, ఈపీఎప్‌లకు కృషి చేస్తామన్నారు.



కాంట్రాక్టు కార్మికులకు బ్యాంకు ల ద్వారా వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణలో వయో పరిమితి అన్ని శాఖలకు ఒకే తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ కోసం ఉద్యమించినట్లు చెప్పారు. యూనియన్ నాయకుడు రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో 2010లో వేతన సవరణలు జరిగాయన్నారు. మళ్లీ గడువు పూర్తయి 8 నెలలు కావస్తున్నా వేతన సవరణలు జరగలేదన్నారు.



అన్ని యూనియన్లలో అవినీతికి పాల్పడ్డ నాయుకులు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. జిల్లా నాయకుడు శివయ్య మాట్లాడుతూ పనిచేసే యూనియన్‌గా వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఎదగాలని ఆకాంక్షించారు. విశ్రాంత ఉద్యోగి వెంకటరావు మాట్లాడుతూ అనుభవం లేని నాయకత్వం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.



వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నూతన కమిటీ

వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు రీజనల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ హాటల్‌లో ఆదివారం సమావేశమైన డిస్కం అధ్య, కార్యదర్శుల సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రీజనల్ అధ్యక్షుడిగా కె.రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంవీ రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా జీవీ శివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రీజనల్ ఉపాధ్యక్షులుగా సీహెచ్ సాంబశివరావు, కె.దేవదాసు, కోశాధికారిగా ఎస్‌కే షాహిద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్‌వీ కార్తిక్, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ సురేష్‌బాబు, ఎం.సుభాన్‌బేగ్‌లను ఎన్నుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top