కొండంత భరోసా

కొండంత భరోసా - Sakshi


యమపాశాలైన విద్యుత్ తీగలు అయిన వారిని పొట్టన పెట్టుకోగా.. ఆ అగ్నికీలల్లో గుండెలు మండిపోతూ శోకాగ్నితో కుమిలిపోతున్న వారికి ఓ చల్లని పలకరింపు వినిపించింది. కన్నీళ్లు పరవళ్లు తొక్కుతూ దుఃఖసాగరంలో మునిగిన అభాగ్యులను రెండు చేతులు ఆర్తిగా తాకాయి. కుటుంబ పెద్దను కోల్పోయి కుంగిపోయిన అమాయకులకు ఊరడింపు లభించింది. ఊర్మిళానగర్‌లో ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. నేనున్నానని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.

 

- ఊర్మిళానగర్ విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ

- అండగా ఉంటానని హామీ

- విజయవాడ, నందిగామలో సాగిన పర్యటన

- దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం

సాక్షి, విజయవాడ :
‘దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. ఇంటిపెద్ద చనిపోయాడు. కుటుంబసభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధైర్యంతో ఉండండి. నేను అండగా ఉంటాను.’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం భవానీపురంలోని ఊర్మిళానగర్‌లో ఇటీవల కరెంట్ షాక్‌తో మృతిచెందిన కుటుంబాలను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉండి వారి పక్షాన పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

 

మృతుల కుటుంబాలకు అండగా..

జగన్ శనివారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చారు. ఎనికేపాడు వద్ద పార్టీ కార్యకర్తలు పలువురు జగన్‌ను కలిసి స్వాగతం పలికారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి నేతృత్వంలోని పార్టీశ్రేణులు జగన్‌ను కలిశారు. ఆ తర్వాత కేదారేశ్వరపేట వద్ద పార్టీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు కలిశారు. అనంతరం ఎర్రకట్ట వద్ద పలువురు మహిళలు జగన్‌ను కలిసి తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ప్రభుత్వం తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పోరాడతారని జగన్ భరోసా ఇచ్చారు.



అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన జగన్‌ను చిట్టినగర్‌లో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అశోక్ యాదవ్ నేతృత్వంలో పలువురు కలిశారు. అక్కడి నుంచి నేరుగా జగన్ ఊర్మిళానగర్ చేరుకున్నారు. విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఘంటా సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లారు. సుబ్బారెడ్డి భార్య చిన్నక్క, కుమారుడు తిరుపతిరెడ్డి, వారి బంధువులు జగన్‌ను చూసి తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో మృతుడు బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన భార్య రాధమ్మను, కుమారులు నారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డిను పరామర్శించారు. అక్కడి నుంచి నందిగామకు వెళ్లిన జగన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

 

నందిగామలో పరామర్శలు

నందిగామ మండలం చందాపురంకు చెందిన జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా సంఘ సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు కొద్ది నెలల కిందట హత్యకు గురయ్యారు. ఆయన భార్య శ్రీలక్ష్మీ సుజాత, పిల్లలు రామకృష్ణ, విష్ణుప్రియ, బంధువులను జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి అనసాగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ నాయకుడు పాములపాటి రామకృష్ణ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. రామకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావును ఓదార్చారు.



ఈ కార్యక్రమంలో పార్టీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సమన్వయకర్తలు గౌతంరెడ్డి, జోగి రమేష్, సింహాద్రి రమేష్ బాబు, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, పార్టీ జెడ్పీ ఫోర్ల్‌లీడర్ తాతినేని పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు బట్టిపాటి సంధ్యారాణి, దాసరి మల్లేశ్వరి, బీబీ జాన్, ఝూన్సీ, వీరమాచినేని లలిత, ఆవుతు శ్రీశైలజ, ఆసిఫ్, బుల్లా విజయ్‌కుమార్, జమలపూర్ణమ్మ, పార్టీ నాయకులు అశోక్‌యాదవ్, డీహెచ్‌ఎస్‌వీ జానారెడ్డి పాల్గొన్నారు.

 

జగనన్న ఉన్నారన్న ధైర్యం వచ్చింది మృతుల కుటుంబసభ్యులు

మాలాంటి పేదవారి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్న ధైర్యం వచ్చిందని ఊర్మిళానగర్‌లో విద్యుదాఘాతానికి బలైన మృతుల కుటుంబసభ్యులు తెలిపారు. జగన్ వచ్చి తమను పరామర్శించటంపై మృతుల కుటుంబసభ్యులు తమ మనోగతాన్ని ‘సాక్షి’కి వెల్లడించారు. మృతుడు ఘంటా సుబ్బారెడ్డి భార్య చిన్నక్క మాట్లాడుతూ జగన్ తమ ఇంటికి రావడం ఎంతో మనోధైర్యాన్నిచ్చిందన్నారు. కుమారుడు తిరుపతిరెడ్డిని జగన్ సార్ చదివిస్తానని చెప్పటం ఊరట కలిగించిందని చెప్పారు. మరో మృతుడు బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి కుమారులు నారాయణరెడ్డి, ప్రశాంత్, ప్రదీప్ మాట్లాడుతూ జగన్ సార్ లాంటి వ్యక్తులు సమాజానికి అవసరమన్నారు.

 

జగన్‌ను కలిసిన స్థానిక నాయకులు

బాధితుల పరామర్శకు వచ్చిన జగన్‌ను పలువురు స్థానిక నాయకులు కలిశారు. వారిలో 29వ డివిజన్ కన్వీనర్ ఎస్.రామిరెడ్డి, బట్టిపాటి శివ, ఎం పోలిరెడ్డి, అబ్దుల్ ఖాదర్, వెంగళరెడ్డి, పప్పుల రమణారెడ్డి, తలారి హరీష్‌మిత్ర, మనోజ్ కొఠారి, కర్నాటి రాంబాబు, డీహెచ్‌వీఎస్ జానారెడ్డి, కామా దేవరాజు, బండారి వెంకట్, ఏపీ భాస్కరరావు, ఎస్‌కె సలాం, తుమ్మా ఆదిరెడ్డి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, లేళ్ల లాజర్, ఎస్ రమాకాంత్, వీరారెడ్డి ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top