స్పష్టత లేని ‘రుణమాఫీ’!

స్పష్టత లేని ‘రుణమాఫీ’! - Sakshi


 రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు తలలు బాదుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటనను టీడీపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నా శ్రీకాకుళం జిల్లా రైతులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ, బంగారు, వ్యవసాయ రుణాలపై వడ్డీ ఎంత?, రీషెడ్యూలింగ్ లాంటి అంశాల్లో కూడా ఇటు రిజర్వు బ్యాంకు నుంచి, అటు ప్రభుత్వం నుంచి గానీ ఇప్పటికీ జిల్లా బ్యాంకు అధికారులకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

 

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో అర్హులైన రైతు ఖాతాలకు, వారికి భవిష్యత్తులో అందే రుణమాఫీపై భారీ తేడా కనిపిస్తోంది. డ్వాక్రా రుణాల విషయంలో కూడా ప్రభుత్వం పేర్కొన్నట్టుగా మాఫీ అయినా అది కేవలం 50 శాతానికే పరిమితం అని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గత ఎన్నికల్లో పేర్కొన్నట్టుగా రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగాలని రైతులు కోరుకుంటున్నారు. వాస్తవానికి గతేడాది డ్వాక్రా రుణాల నిమిత్తం సుమారు రూ.500 కోట్లు రుణాలిచ్చారు. ఈసారి పెరగాల్సింది పోయి మహిళలు తీసుకున్న అసలు, వడ్డీ ఏదీ చెల్లించకపోవడం గమనార్హం. దీనికి కూడా రాష్ర్టస్థాయి బ్యాంకర్ల కమిటీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ-ఎస్‌ఎల్‌బీసీ) నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీనికి సంబం ధించి ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వంతో మరోమారు చర్చలు ఉండే అవకాశం ఉంటుం దని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇదీ కథజిల్లా వ్యాప్తంగా సుమారు 250 బ్యాంకులు న్నాయి.

 

 పైలీన్ తుపాను కారణంగా జిల్లాను కరువు మండలంగా ప్రకటించారు. వేలాది గ్రామాల్లో రీషెడ్యూలు, మాఫీ విషయానికి సంబంధించి తెలుగుదేశం నేతలు చెబుతున్న ట్టు రుణమాఫీ ఈ తరహాలో మరెక్కడా జరగడం లేదని సంబరాలు జరుపుతున్నారు. అయితే గణాంకాలకు సంబంధించి మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కొన్నాళ్లగా రికవరీ కూడా లేదని బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపినా నేతలు చెప్పేది వినడం తప్పితే ఎలాంటి స్పందనా లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో 5 లక్షల మందికి స్వయంసహాయక గ్రూపుల కింద రుణాలిచ్చిన బ్యాంకర్లు ఇప్పుడు వాటి రికవరీ విషయంలో తలపట్టుకుంటున్నారు.

 

 వడ్డీ కట్టాల్సిందే

 రుణాలిచ్చేముందు బ్యాంకు అధికారులు సం తకాలు తీసుకుంటుంటారు. ఈ మేరకు రైతులు తీసుకునే వ్యవసాయ, బంగారు, తత్కాలిక రుణాలకు సంబంధించి సంతకాలు పెట్టేశారు. ఈ మేరకు రుణమాఫీ సకాలంలో జరగకపోతే 13 నుంచి 13.5 శాతం వడ్డీ కట్టాల్సిందేనని, ఈ మేరకు కోట్లాది రూపాయలు వడ్డీ రూపంలో కట్టాల్సిందేనని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ప్రతి నెలా వడ్డీ క ట్టాల్సిందేనని, వడ్డీతో పాటు తీసుకున్న రుణం మొత్తంలో మూడు శాతం వరకూ అసలు కూడా కట్టాల్సిం దేనంటున్నారు. డ్వాక్రా రుణాలకు సంబం దించి రీషెడ్యూలన్నది ఉండదని, ఆరు నెలలు, ఒక ఏడాది దాటితే మళ్లీ రెన్యూవల్ చేసుకో వచ్చని మాత్రం హామీ ఇస్తున్నారు. చంద్ర బాబు ప్రకటించినట్టుగా డ్వాక్రా రుణాలకు రూ.లక్ష చొప్పున మాఫీ చేయాల్సి వస్తే అప్పుడు కూడా వడ్డీ 13 నుంచి 14 శాతం చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

 

 ఆదేశాలేవీ?

 ఇప్పటివరకూ ఎలాంటి రీషెడ్యూల్ ఆర్డర్స్ రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా కని పించడం లేదు. అన్ని కుటుంబాలకు రూ.లక్ష న్నర రుణమాఫీ విషయంలో కూడా బ్యాం కర్లకు స్పష్టత రాలేదు. రిజర్వుబ్యాంకు, ఎస్‌ఎల్‌బీసీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలొస్తేనే, ఖాతాలు సరిచూసుకుని మాఫీ చేయాల్సి ఉంటుందని దానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. మరోవైపు డ్వాక్రా రుణాలకు సంబంధించి రీ షెడ్యూల్ జరిగే ప్రసక్తే లేదని బ్యాంకర్లంటున్నారు. దీనికి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు బ్యాంకుల నిబంధన లను బట్టి 13 నుంచి 14 శాతం వడ్డీ కట్టిం చాల్సిందేనని పట్టుబడుతున్నారు. అంతే కాకుండా కొత్తగా రుణాలిచ్చే అవకాశం ఉంది తప్పితే రీషెడ్యూల్ అయ్యే పరిస్థితే లేదని, ఒక వేళ క్యాష్ క్రెడిట్స్ కింద మార్పు చేస్తే మాత్రం మరోమారు ఆలోచించాల్సిందేనంటున్నారు.

 

 స్టేట్‌మెంట్స్ రాసుకోవాల్సిందే

 జిల్లావ్యాప్తంగా రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు.. చంద్రబాబు ప్రకటించినట్టుగా రుణ మాఫీ చేయాలని అనుకున్నా దానికీ పెద్ద లెక్కలే వేయాలంటున్నారు. వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు, టర్మ్‌లోన్ల కింద రైతులు వాడుకుంటే వాటిని ఏఏ బ్యాంకులు, ఎంతెంత వడ్డీ కింద రుణాలిచ్చాయో ముందు స్టేట్‌మెం ట్లు తయారు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకుల్ని సంప్రదించి ఆయా రైతులు తీసుకున్న రుణాల వివరాలు సేకరించి, రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు రుణమాఫీ ఎంత ఉంటుందో ఆ మొత్తాన్ని ఆయా బ్యాం కులు పంచుకోవాల్సిందేనని, ఆ లెక్కనే రైతు లకు రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేస్తు న్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ బుక్, ఆధార్ సీడింగ్, ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) కూడా పరిశీలించాల్సిందేనంటున్నారు. ఇదం తా జరిగేసరికి కనీసం ఏడాది సమయం పడు తుందని బ్యాంకర్లే చెబుతున్నారు. వాస్త వానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం రుణాల్లో 50 శాతం కూడా మాఫీ అయ్యే ప్రసక్తే లేదం టు న్నారు. అన్నివర్గాల నుంచీ సుమారు రూ.1900 కోట్లు రుణాలుంటే వాటిలో కేవలం రూ.300 కోట్లు మేరకే మాఫీ అవుతుందంటున్నారు.

 

 ఈ యేడాది మార్చి 31 వరకు

 జిల్లా బ్యాంకు అధికారులు

 సేకరించిన వివరాలు

   జిల్లాలో అర్హులైన రైతులు 3 లక్షల 16 వేల మంది

   రుణమాఫీ కావాల్సిన మొత్తం రూ. 1142 కోట్లు

   బంగారు ఆభరణాల ఖాతాలు :1లక్ష 3 వేల మందికి ఉన్నాయి

   మాఫీ మొత్తం : రూ.772 కోట్లు

   చిన్న చిన్న (టర్మ్) అప్పులు తీసుకున్న ఖాతాలు : 29 వేలు

   చెల్లించాల్సిన మొత్తం : రూ.88 కోట్లు

   జిల్లా వ్యాప్తంగా చెల్లించాల్సిన మొత్తం (అన్ని రకాలు కలిపి) సుమారు రూ.1900 కోట్లు

   ప్రభుత్వం, లీడ్‌బ్యాంకు కమిటీ, రిజర్వు బ్యాంకు కమిటీ నుంచి ఒకవేళ స్పష్టమైన ఆదేశాలొస్తే కేవలం రూ.300 కోట్లకే రుణ మాఫీ పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 రూ. లక్షన్నర పరిమితి తగదు

 రుణమాఫీ అమలులో ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర పరిమితి విధించడం సీఎం చంద్రబాబుకు తగదు. రూ. లక్షన్నరకు మించి పంట రుణాలు తీసుకున్న కుటుంబాలున్నాయి. తొలుత సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదు. ఎన్నికల ముందు మొత్తం రుణం మాపీ చేస్తారన్న హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయారు. ఇప్పుడు రుణాలపై వడ్డీ పెరిగిపోతోంది.

 - కరణం శ్రీనివాసరావు, రైతు, ఇప్పిలి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top