Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Sakshi | Updated: March 21, 2017 09:51 (IST)
చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ నిబంధన 168 కింద స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఈ నోటీసు అందచేసింది. కాగా సభలో వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు ’అలగా జనం’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  తమను ఉద్దేశించి ముఖ్యమంత్రి అలగా జనం అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేసినందుకుగాను వైఎస్‌ఆర్‌సీపీ ఈ నోటీసులు ఇచ్చింది.  ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నందుకు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి అనుచితమని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు తమ నోటీసులో పేర్కొన్నారు.

కాగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సభలో ... ‘‘అలగా జనం, అబద్ధాలు, తిన్నింటి వాసాలు, న్యూసెన్స్, గుండెల్లో నిద్రపోతా, మీ బండారం బయటపెడతా, మీ అంతు చూస్తా, పుట్టగతులుండవు’’ వంటి పదాలతో ఊగిపోయిన విషయం విదితమే.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC