Alexa
YSR
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడిపంటలతో పులకించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

వెల్లువెత్తిన ప్రజాదరణ

Sakshi | Updated: August 13, 2017 04:01 (IST)
వెల్లువెత్తిన ప్రజాదరణ

జగన్‌ రోడ్‌షోకు భారీ స్పందన
రాఖీలు కడుతూ, హారతులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ స్వాగతం పలికిన మహిళలు


గోస్పాడు: ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు ప్రజాదరణ వెల్లువెత్తింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  మండలంలోని ఒంటివెలగల, గోస్పాడు, శ్రీనివాసపురం, యాళ్లూరు, ఎం.కృష్ణాపురం గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు రాఖీలు కడుతూ, హారతులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ బ్రహ్మరథం పట్టారు. ఒంటివెలగలలో ప్రారంభమైన రోడ్‌షో ఎం.కృష్ణాపురం వరకు 16 కి.మీ పొడవునా 8గంటల పాటు జరిగింది. ఏ గ్రామానికి వెళినా దారి పొడవునా ప్రజలు జగన్‌ను కలిసేందుకు ఉత్సాహంతో వేచి చూశారు.

ఆప్యాయంగా పలకరింపు..
జగనన్న వస్తున్నారని తెలుసుకొని పొలాల్లో పనిచేస్తున్న మహిళలు రోడ్లపైకి వచ్చి ఆయనతో మాట్లాడారు.  జగన్‌ కూడా వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి జగన్‌ మాట్లాడుతున్నంత సేపు యువకులు కేరింతలు కొడుతూ, చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు.

కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డి, మండల కన్వీనర్‌ వంగూరి భాస్కరరెడ్డి, ద్వారం వీరారెడ్డి, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాగమోహన్‌రెడ్డి, అరవింద ప్రసాద్, రాజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సర్పంచ్‌ కోటిరెడ్డి, రామసుబ్బారెడ్డి, బెక్కెం నాగేశ్వరరెడ్డి, నారాయణ, నాగేశ్వరరావు, సైమాన్, ముక్కమళ్ల భాస్కరరెడ్డి, ముక్కమళ్ల అశోక్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, భక్తవత్సలరెడ్డి, కూలూరు ప్రసాద్, చిన్ననరసింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, వంగూరి రామనాథరెడ్డి, గడ్డం ప్రసాద్, పార్థసారథిరెడ్డి, సర్వేశ్వరరెడ్డి, శివానందరెడ్డి, న్యాయవాదులు ద్వారం మాధవరెడ్డి, వివేకానందరెడ్డి, రామసుబ్బారెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC