సర్కారుపై సమర భేరి

సర్కారుపై సమర భేరి - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు :టీడీపీ సర్కారు సాగిస్తున్న నయవంచక పాలనపై పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సమరభేరి మోగనుంది. రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు, సీఎం చంద్రబాబునాయుడు నయవంచక స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో నిర్వహించ తలపెట్టిన దీక్ష చరిత్రాత్మకంగా నిలిచిపోయేలా పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ దగాకోరు పాలనపై  ‘పశ్చిమ’ నుంచే మడమ తిప్పని పోరు మొదలు పెట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచామని విర్రవీగుతున్న టీడీపీ నేతలకు చెంపపెట్టులా ఉండేలా వైఎస్ జగన్ సభను కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

 

 టీడీపీ అధికారంలోకి వచ్చిన దరి మిలా ఏడునెలల ప్రజాకంటక పాల నపై విసుగెత్తిన ప్రజల ఆగ్రహావేశాలను ఈ దీక్ష ద్వారా సర్కారుకు చూపించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. రుణమాఫీ కొర్రీతో రైతన్నల తోపాటు మహిళలను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, రూ.వెయ్యి పింఛను ఇస్తామంటూ సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ చేపట్టిన రెండు రోజుల ధర్నాను  విజ యవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జిల్లా సారథి ఆళ్ల నాని ఇప్పటికే నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రైతు దీక్షకు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ జిల్లా నేతలను సమన్వయపరుస్తూ దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు తమ ప్రాంతాల నుంచి భారీగా జనాన్ని సమీకరించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 ఇదీ రుణం తీర్చుకోవడమంటే..

 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పశ్చిమగోదావరి జిల్లాపై మొదటి నుంచీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేం దుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టింది ఇక్కడి నుంచేనని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ విగ్రహాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఇదే జిల్లా నుంచేనని పేర్కొం టున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ జి ల్లాపై ప్రత్యేక అభిమానంతో పార్టీ నేతలకూ ప్రాధాన్యం కల్పించేవారని అంటున్నారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను నమ్మి టీడీపీ పక్షాన నిలబడిన పశ్చిమ ఓటర్లకు 6 నెలలు దాటకుండానే టీడీపీ నయవంచన అర్థమైంది.

 

 సర్కారు నయామోసంతో అన్ని విధాలుగా నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు ఎవరున్నారా అని ఎదురుచూస్తుండగా,  నేనున్నానంటూ వైఎస్ జగన్ ముందుకు వస్తున్నారు. సర్కారు దారుణాలపై ఇక్కడి నుంచే రణభేరి మోగించనున్నా రు. జిల్లాలో అన్ని స్థానాలనూ గెలిపిం చిన పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ బీరాలు పలుకుతున్న సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ధర్నాతో సర్కారుపై ప్రజాగ్రహం ఎలా ఉందో అర్థం కానుం దని వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రుణం తీర్చుకోవడమంటే పదే పదే జిల్లాకు వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్ప డం కాదని..  గెలిచినా ఓడినా ప్రజాపక్షం గా నిలవడమే రుణం తీర్చుకోవడమని వైఎస్ జగన్ నిరూపించనున్నారని రాజ కీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top