చంద్రబాబూ..ఇదే నా చాలెంజ్!

చంద్రబాబూ..ఇదే నా చాలెంజ్! - Sakshi

  • ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో విచారణ చేయించుకో ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలిసొస్తుంది   

  •  టీడీపీ అధినేతకు జగన్‌మోహన్‌రెడ్డి సవాల్

  •   ఎమ్మార్‌కు సింగిల్ బిడ్‌పై కాంట్రాక్టు ఇచ్చారు..

  •   ఐఎంజీ డమ్మీ కంపెనీకి 850 ఎకరాలు ఇచ్చారు

  •   దీనిపై విచారణకు ైెహకోర్టు ఆదేశాలు ఇచ్చింది..

  •   సిబ్బంది లేరంటూ సీబీఐ నెల రోజులు నాన్చింది

  •   బాబు నాట్ బిఫోర్ నాటకాలతో స్టే తెచ్చుకున్నారు..

  •   కాంగ్రెస్‌తో కుమ్మక్కై వ్యవస్థలను మేనేజ్ చేశారు

  •   {పజలపై మోయలేని విద్యుత్ భారం మోపిన

  •   కిరణ్ సర్కారును విప్ జారీ చేసి మరీ బాబు కాపాడారు

  •   బాబు తన పాలనలో అభివృద్ధి అంటూ చెప్తున్నదంతా డొల్లే.. వాస్తవానికి జరిగిందంతా తిరోగమనం

  •   ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, సేవా రంగాలన్నీ కుదేలయ్యాయి

  •   వైఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు తీసింది.. ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి

  •   ఐటీ రంగంపైనా బాబు సొంత డబ్బా ఉత్తిదే నిజానికి బెంగళూరుకన్నా మన రాష్ట్రం వెనుకబడింది

  •   బాబు హయాంలో 250 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు వైఎస్ హయాంలో 2,500 కోట్లకు పెరిగాయి

  •   బాబు 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించారు 26 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు

  •   ఆ సంస్థలను తన పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టేశారు..

  •   నామాకు పాలేరు చక్కెర ఫ్యాక్టరీ ఇచ్చారు 

  •   నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును సి.ఎం.రమేష్‌కు.. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు అప్పజెప్పారు 

  •   సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్రకు, విశాఖ డెయిరీని అడారి తులసీరావుకు ఇచ్చి ప్రైవేటు కంపెనీలు చేశారు

  •   బాబు మరో ఐదేళ్లు ఉంటే.. ఏపీఎస్‌ఆర్‌టీసీ గంగలో కలిసేది.. కరెంటు ఉద్యోగులు వీధిపాలయ్యేవాళ్లు 

  •   జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు

  •   విలువలు, విశ్వసనీయత ఏమాత్రం లేని వ్యక్తి.. అధికారం కోసం ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధమే 

  •   టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగినవైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి

  • సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబునాయుడు బండారమేంటో నిగ్గు తేలాలంటే రెండే రెండు కేసుల్లో విచారణ జరిపిస్తే చాలు. ఐఎంజీ, ఎమ్మార్ రెండు కేసుల్లో విచారణ జరిపిస్తే చంద్రబాబు ఎన్ని రోజులు చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వస్తుందో తెలిసొస్తుంది. ఈ రెండు కేసుల్లో చంద్రబాబు తాను చేసిందంతా కరెక్టే అని అనుకుంటే విచారణ జరిపిద్దాం. లేదా ఆయనే విచారణకు సిద్ధపడాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ అధినేతకు సూటిగా సవాల్ విసిరారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ సీబీఐని కూడా తనపై కేసుల్లో విచారణ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టిన చంద్రబాబు ఎన్నయినా మాట్లాడతారని ఆయన దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనను గెలిపిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని, జగన్‌ను గెలిపిస్తే చంచల్‌గూడ జైలు నుంచి పాలన సాగిస్తారని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. 

     

     పప్పుబెల్లాలకు భూములిచ్చేసిన ఘనుడు...

     

     ‘‘చంద్రబాబు వ్యవహారం ఏమిటో తేలాలంటే ఎంతో అవసరం లేదు. ఐఎంజీ, ఎమ్మార్ రెండు కేసులు చాలు. ఎమ్మార్ విషయంలో సింగిల్ బిడ్‌పై  కాంట్రాక్టు ఇచ్చారు. ఐఎంజీ విషయంలో అయితే మరీ అన్యాయంగా వ్యవహరించారు. ఒక డమ్మీ కంపెనీకి 850 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో 230 ఎకరాలనైతే మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా చంద్రబాబు తన లెటర్‌హెడ్‌పై సంతకం చేసి కేటాయించారు. ఐఎంజీ భారత కంపెనీ ఏమిటో తమకు తెలియదని అమెరికాలోని ఐఎంజీ ఫ్లారిడా కంపెనీ కూడా చెప్పింది. అలాంటి డమ్మీ కంపెనీకి చంద్రబాబు శనక్కాయలు, బెల్లానికి (కారు చౌకగా) భూమిని కేటాయించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశిస్తుంది.. కానీ తమ వద్ద సిబ్బంది లేరని ఆ సంస్థ నెల రోజులు జాప్యం చేస్తుంది. చంద్రబాబును ఒక్క రోజూ విచారణకు పిలువదు’’ అని జగన్ ధ్వజమెత్తారు. సీబీఐ నెల రోజులు విచారణ జరపకుండా జాప్యం చేస్తే.. ఈలోపు ‘నాట్ బిఫోర్...’ డ్రామాతో కోర్టుల నుంచి చంద్రబాబు దర్యాప్తుపై స్టేలు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్య ప్రజలపై 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను బాదినా.. చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి కాపాడారని జగన్ గుర్తుచేశారు. ప్రభుత్వం నిలబడటానికి 148 మంది సభ్యుల బలం కావలసి ఉండగా, ప్రతిపక్షాలన్నీ కలిసి పెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత కాంగ్రెస్‌కు 146 ఓట్లే వచ్చాయి. మెజారిటీకి 2 స్థానాలు తక్కువగా ఉన్నా చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా విప్ జారీ చేసి మరీ కాపాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబుకు నేనొక చాలెంజ్ చేస్తున్నా... ఒక్క ఎమ్మార్, ఐఎంజీ బాగోతాలపై విచారణ జరిపించుకో చాలు... నువ్వెన్ని రోజులు చంచల్‌గూడ జైల్లో ఉంటావో చూద్దాం...’’ అని సవాల్ విసిరారు.

     

     బాబు పాలనలో అభివృద్ధి తిరోగమనం... 

     ‘నేను అది చేశాను, ఇది చేశాను... నిర్మించాను’ అని డబ్బాకొట్టుకుంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా డొల్లేనని.. వాస్తవానికి ఆయన పాలనలో అన్ని రంగాలూ తిరోగమించాయని జగన్‌మోహన్‌రెడ్డి గణాంకాలతో సహా బయటపెట్టారు. ఒక్కో అంశాన్ని విశ్లేషిస్తూ చంద్రబాబు తన పాలనలో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధిలో ఏమాత్రం వాస్తవం లేదని విడమర్చి చెప్పారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగం లాగా సాగింది. చంద్రబాబు పాలనలో అంతా మీడియాను మేనేజ్ చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. చంద్రబాబు గోరంత చేసి కొండంత చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు పాలన 1994 నుంచి 2004 వరకూ వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, సేవా రంగాలన్నింటిలోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పైగా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అదే వైఎస్ హయాంలో అభివృద్ధి ఎలా పరుగులు తీసిందో ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వైఎస్ మరణించాక మళ్లీ ఆ అభివృద్ధి కుంటుపడింది’’ అని జగన్ వివరించారు. తన హయాంలో వైఎస్ అన్నివిధాలా అభివృద్ధి చేసినా ఆయన ఏనాడూ చంద్రబాబులాగా డబ్బా కొట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో చంద్రబాబు పాలనకు ముందు, ఆయన పాలనలో ఆ తర్వాత వైఎస్ పాలనలో, ఆయన మరణం తర్వాత కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై అధికారిక గణాంకాలను జగన్ చదివి వినిపించారు.

     

     ఐటీ రంగంపై బాబు డబ్బా అంతా డొల్లే...

     ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు రాష్ట్రం ఐటీ రంగంలో దేశం మొత్తం మీద మూడో స్థానంలో ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అది కాస్తా అయిదో స్థానానికి పడిపోయింది. చంద్రబాబు హయాంలో దేశం మొత్తం మీద మన రాష్ట్రం నుంచి ఐటీ వాటా 8 శాతంగా ఉంటే వైఎస్ హయాంలో దానిని 14 శాతానికి పెంచారు. ఇంత డబ్బా ఎలా కొట్టుకుంటున్నారు బాబూ...! చంద్రబాబు హయాంలో మన రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు 81 వేల మంది మాత్రమే ఉంటే వైఎస్ పాలనలో 2.35 లక్షల మందికి పెరిగారు. చంద్రబాబు పాలనలో 2004 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ. 5,000 కోట్ల మేరకు ఉంటే వైఎస్ ఐదేళ్ల పాలనలో ఆ ఎగుమతులు రూ. 26,000 కోట్లకు పెరిగాయి. ఇక్కడొక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఐటీ రంగంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఎగుమతుల్లో రూ. 250 కోట్ల మేరకు మాత్రమే వ్యత్యాసం ఉండేది. అదే చంద్రబాబు హయాంలో ఈ తేడా రూ. 2,500 కోట్లకు పెరిగింది. అంటే బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రూ. 2,500 కోట్ల మేర వెనుకబడి ఉంది. ఏ ముఖ్యమంత్రి పాలించిన ఐదేళ్లతో పోల్చినా వైఎస్ పాలనకు సాటి రానే రాదని గంటాపథంగా చెప్తున్నాను. ఇది ఇవాళ మేం చెప్తున్న వివరాలు కావు.. ప్రభుత్వం ప్రచురించిన గణాంకాలే. 

     

     ప్రభుత్వ రంగ సంస్థలను  ‘తమ్ముళ్ల’కు రాసిచ్చేశారు..

     చంద్రబాబు తన హయాంలో చేసింది అభివృద్ధి కాదు, ఆయన చేసిందల్లా ఏమిటంటే 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించడం. ఉద్యోగాల గురించి పెద్దగా మాట్లాడే చంద్రబాబు తన పాలనలో 26 వేల మందిని రోడ్డు మీద పడేశారు. ఇలా మూతపడిన 65 ప్రభుత్వ రంగం సంస్థలను కూడా టీడీపీకి చెందిన తన మనుషులకే కారుచౌకగా శనక్కాయలు, బెల్లానికి ఇచ్చేశారు. టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావుకు పాలేరు చక్కెర ఫ్యాక్టరీని, నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును సి.ఎం.రమేష్‌కు, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. ఇక సంగం డెయిరీని తన పార్టీకి చెందిన ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తే దానిని ఆయన ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. విశాఖ డెయిరీని టీడీపీకి చెందిన అడారి తులసీరావుకు ఇస్తే దానిని ఆయన ప్రైవేట్ కంపెనీగా మార్చేశారు.’’

     

     బాబు ఇంకో ఐదేళ్లు ఉండి ఉంటే ఆర్‌టీసీ ఖతం

     మరో ఐదేళ్లు కనుక చంద్రబాబు పరిపాలించి ఉంటే ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎపుడో గంగలో కలిసిపోయి ఉండేది. కరెంటు ఉద్యోగులు రోడ్డు మీద పడి ఉండేవాళ్లు. జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుది. ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారంలోకి రావాలన్నదే ఆయన తపన. విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేని వ్యక్తి. ఎన్నికలకు ముందొక మాట, ఎన్నికలు అయిపోయాక మరో మాట మాట్లాడ్డం ఆయన నైజం. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని చెప్తారు. ఎన్నికలయ్యాక ఈనాడు పత్రికతో మద్య నిషేధం వద్దని రాయించి దానిని ఎత్తేస్తారు. రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్తారు. ఆ తరువాత మళ్లీ రూ.5.25లకు పెంచేస్తారు. ఏ మాత్రం విశ్వసనీయత, విలువలు లేని వ్యక్తి ఆయన. అధికారం కోసం ఆయన ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధమే. ఆయన ఎంత దూ రం వెళతారంటే పిల్లనిచ్చిన సొంత మామను కూడా ఆధికారం కోసం వెన్నుపోటు పొడవటానికి వెనుకాడడు’’ అంటూ చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు.

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top