‘వైఎస్సార్‌ కుటుంబం’తో జనం మమేకం


- ఊరూవాడా అపూర్వ స్పందన

ఇంటింటికీ వెళ్లి సర్కారు వైఫల్యాలు వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

-  డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా కూడా సభ్యులుగా చేరే అవకాశం



సాక్షి, అమరావతి: ఊరూ వాడా జనం ‘వైఎస్సార్‌ కుటుంబం’తో మమేకమవుతున్నారు. ఇంటికొ స్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మూడేళ్ల తెలుగుదేశం పాలనలో విసిగిపోయిన వారు తమ అనుభవాలను ఏకరవు పెడుతున్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం నుంచి చేపట్టిన ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్రమానికి తొలిరోజు రాష్ట్రంలో అటు శ్రీకాకుళం మొదలు.. ఇటు అనంతపురం వరకు విశేష స్పందన కన్పించింది. మొదటి రోజే 4 లక్షల మంది వైఎస్సార్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి చూపడం విశేషం.



అంచనాలకు మించి పార్టీ సభ్యత్వం కోరుతున్న వారి సంఖ్య ఉండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కోటి కుటుంబాలను నేరుగా కలిసి రాష్ట్రంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితిని వివరించాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌.. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబాన్ని వైఎస్సార్‌ కుటుంబ సభ్యులుగా చేర్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఒక గ్రామంలో పది మంది బూత్‌ కమిటీ సభ్యులుంటే ఒక్కొక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలుస్తున్నారు.



ప్రతీ ఇంట్లో ఆ సభ్యుడు 20 నిమిషాల పాటు కూర్చొని సీఎం చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను వివరిస్తున్నారు. అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కుటుంబంలో చేరడానికి ఇష్టపడే వారితో 9121091210 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పిస్తున్నారు. ఆ వెంటనే అదే నంబర్‌ నుంచి వారికి కాల్‌ వస్తుంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సందేశం వినిపిస్తుంది. డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా కూడా  www.ysrkutumbam.comకు లాగిన్‌ అయ్యి వైఎస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేరే అవకాశం కూడా పార్టీ కల్పించింది. 


 

వైఎస్సార్‌ కుటుంబంలో భాగస్వాములు కండి : వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘వైఎస్‌ఆర్‌ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే మీ చెంతకు వస్తోంది. వైఎస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములు కావాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను’ అని ట్వీటర్‌లో కోరారు. 


 


సంబంధిత వార్తలు :
అధికార వికేంద్రీకరణలో విప్లవాత్మక మార్పు: వైఎస్‌ జగన్‌

సమస్యల పరిష్కార వేదిక వైఎస్‌ఆర్‌ కుటుంబం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top