'ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం'

'ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం' - Sakshi


రాజమండ్రి: దివంగత మహానేత వైఎస్సార్ చేపట్టిన ఆరికరేవుల ఎత్తిపోతల ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తామని ఆయన హామీయిచ్చారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో జగన్ మాట్లాడారు.



5 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో ఆపేసిందని జగన్ కు అన్నదాతలు ఫిర్యాదు చేశారు.  9 ఎకరాల భూసేరణకు రూ. 4.5 కోట్లు సిద్ధంగా ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో చేపట్టినందునే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు. బస్సుయాత్రలో జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top