వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌




ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉమ్మారెడ్డి ప్రకటన

సాక్షి, అమరావతి:
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షునిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ ప్రాంగణంలో ఆదివారం పార్టీ ప్లీనరీ ముగింపు రోజు సమావేశంలో ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య జగన్‌ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ తరఫున 20 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.



జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు  ప్రకటించిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి వేదికపైన ముందుకు వచ్చి నలువైపులా ఉన్న ప్రతినిధులకు రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు, మీ అందరి కుటుంబ సభ్యునిగా ఆదరిస్తున్నందుకు, కష్టనష్టాల్లో తనతో, వైఎస్సార్‌సీపీతో ఉంటూ ఆరేళ్లుగా ధైర్యంగా పోరాటంలో పాలుపంచుకుంటున్నందుకు జగన్‌.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్‌ మరణించి ఎనిమిదేళ్లు కావస్తున్నా,, ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు చూపుతూ ఇక్కడకు వచ్చిన, రాలేకపోయిన రెండు రాష్ట్రాల్లోని ప్రతీ అక్క, చెల్లెమ్మ.. అన్న, తమ్ముడు.. అవ్వ, తాతలకు చేతులు జోడించి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు.


 


చదవండి:


నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్‌ విజయమ్మ



మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్‌ షర్మిల



'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'




ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌



ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు


వైఎస్‌ఆర్‌ అంటేనే ఓ ప్రేమ మత్తు..


ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు


'లోకేశ్‌ కనీసం సర్పంచి కూడా కాదు..'

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top