వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీకి కొత్తరూపు

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీకి కొత్తరూపు - Sakshi


సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొత్త రూపునిచ్చారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గొల్ల బాబూరావులను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. 14 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు.


 


అనుబంధ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక్కొక్క పరిశీలకుడిని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పార్టీ గ్రామ కమిటీల నిర్మాణం, యువజన, మహిళా, విద్యార్థి విభాగాలను బలోపేతం చేయడంతో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను పార్టీ సమర్ధవంతంగా వినియోగించుకునేలా చూసే బాధ్యతలను అప్పగించారు. పీఎన్వీ ప్రసాద్‌కు పార్టీ నిర్వహణ బాధ్యతలు (అడ్మినిస్ట్రేషన్) అప్పజెప్పారు.

 

 ప్రధాన కార్యదర్శులు.. అప్పగించిన బాధ్యతలు

 సుజయ్‌కృష్ణ రంగారావు - ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు; ధర్మాన ప్రసాదరావు - ఉభయ గోదావరి జిల్లాలు; మోపిదేవి వెంకటరమణ- కృష్ణా, గుంటూరు జిల్లాలు; జంగా కృష్ణమూర్తి- చిత్తూ రు, వైఎస్సార్ జిల్లాలు; ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -ప్రకాశం జిల్లా; భూమన కరుణాకర్‌రెడ్డి - అనంతపురం, కర్నూలు జిల్లాలు.

- అనుబంధ శాఖల రాష్ట్ర అధ్యక్షులు

 

 మహిళా విభాగం- ఆర్‌కే రోజా; యువజన విభాగం- వంగవీటి రాధా; రైతు విభాగం- ఎమ్వీఎస్ నాగిరెడ్డి; ఎస్సీ సెల్ - మేరుగ నాగార్జున; బీసీ సెల్- ధర్మాన కృష్ణదాసు; లీగల్ సెల్ - పోన్నవోలు సుధాకర్‌రెడ్డి; మైనార్టీ సెల్- అంజాద్ బాషా; ఎస్టీ సెల్- తెల్లం బాలరాజు; ట్రేడ్ యూనియన్- గౌతంరెడ్డి


 రాష్ట్ర పార్టీ కార్యదర్శులు : మేడపాటి వెంకట్, రాజీవ్ కృష్ణ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూధన్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ముద్దునూరి ప్రసాదరాజు, అనిల్‌యాదవ్, మేకతోటి సుచరిత, వై.నాగిరెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top