నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే.. లేకుంటే!

నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే.. లేకుంటే! - Sakshi


ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. 22 మంది చనిపోయినా వీళ్లను పరామర్శించేందుకు చంద్రబాబు రాలేదని, పోనీ వచ్చిన మంత్రి ఏదో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహారం ప్రకటించినా, ఇంతవరకు అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన 22 మంది కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన ఏమన్నారంటే..


  • ఇప్పటికి ప్రమాదం సంభవించి 18 రోజులు అవుతున్నా, ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు, ఎందుకిలా మోసం చేస్తున్నారు?

  • అప్పుడు మంత్రులు పబ్లిసిటీ కోసం వచ్చి సాయం ప్రకటించారు.

  • పబ్లిసిటీ వచ్చే కార్యక్రమం ఉంటే చంద్రబాబు అక్కడికెళ్లి 5 లక్షలు అందిస్తారు. వీళ్లూ మనుషులే. వీళ్లూ బాధితులే.. కానీ 5 లక్షలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నాం

  • వాళ్లకు ఇష్టం లేకుంటే తగ్గిస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు

  • 2 లక్షలు ప్రకటించినా.. ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు

  • ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోంది.

  • ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం.

  • మరో నాలుగు రోజుల్లో కుటుంబ సభ్యులకు సహాయం అందకపోతే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాం, కలెక్టరేట్లను ముట్టడిస్తాం.

  • ఇక్కడకు రాబట్టి కనీసం వీళ్లకు సాయం చేయలేదని తెలిసింది.

  • రోడ్లు సరిగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆ కుటుంబంలో మిగిలిన కుర్రాడు చెప్తున్నాడు

  • రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాది

  • విభజనకు మొట్టమొదటిగా పార్లమెంట్ లో  టీడీపీ ఎంపీలు ఓటేసి మద్దతు తెలిపారు

  • ఆ రోజు చంద్రబాబుకు సిగ్గులేదు.. బుద్ధిలేదు

  • రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు

  • రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా మేము ఏ పార్టీకి మద్ధతు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు?

  • రాజకీయం చేయడం కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు

  • ఏకంగా లంచాలు తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు

  • హత్యచేసిన ఒక వ్యక్తి పట్టుబడితే వీడియోలు తీయడం తప్పంటున్నారు..కానీ హత్య చేయడం తప్పు కాదంటున్నారు

  • మనిషి జన్మలో పుట్టిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు

  • పునర్విభజన చట్టంను పూర్తిగా అమలు చేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం

  • విభజన చట్టంలోని సెక్షన్-8 అనేది ఒక అంశం.. సెక్షన్-8 అమలు చంద్రబాబుకు తాను తప్పు చేశాక గుర్తొకొచ్చింది

  • కరెప్షన్ మహారాజా ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top