101 జీవో అన్యాయమైనది:వైఎస్ జగన్

101 జీవో అన్యాయమైనది:వైఎస్ జగన్ - Sakshi


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101 జీవోను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఆ జీవో అన్యాయమైనదిగా జగన్ స్పష్టం చేశారు. గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ జీవోను తెస్తే.. నేటి చంద్రబాబు సర్కారు దాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన జగన్.. ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓసీలతో కమిటీలను ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసమని  ప్రశ్నించారు. గత విధానం ప్రకారం ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లు, బ్యాంకర్లు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేసేవారని.. అదే పద్ధతిలో లబ్ధి దారుల ఎంపిక చేపట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.


 


లబ్ధిదారుల కమిటీ సభ్యుల దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీల రుణాల లబ్ధిదారుల ఎంపికలో సామాజిక కార్యకర్తల పేరుతో కొంతమందిని ప్రవేశపెట్టి వ్యవస్థలను పాడు చేయొద్దని జగన్ సూచించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని కోరిన జగన్.. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయాన్ని ఆధారపూర్వకంగా సభకు సమర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top