'రైతుల ఆత్మహత్యలను బాబు ఒప్పుకునే స్థితిలో లేడు'

'రైతుల ఆత్మహత్యలను బాబు ఒప్పుకునే స్థితిలో లేడు' - Sakshi


తణుకు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం  రైతు తన ఉత్పత్తులను అమ్ముకోలేని స్థితికి చేరడానికి బాబే కారణమని జగన్ విమర్శించారు. రైతులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి వస్తుందని వారి ఆత్మహత్మలను బాబు ఒప్పుకునే స్థితిలో లేడని ఎద్దేవా చేశారు.  బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నా.. చంద్రబాబు నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవడం నిజంగా సిగ్గు చేటన్నారు. రైతులు తీవ్ర కరువులో కూడా రూ. 2, 3 వడ్డీకి అప్పు తెచ్చుకుంటారన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు ఇవ్వాల్సి వస్తుందని రకరకాల కార్డుల లింక్ పెట్టిన ఘనత ఏపీ సీఎందేనని అన్నారు. ఆదివారం నిరాహార దీక్షను ముగించిన అనంతరం రైతులు, డ్వాక్రా మహిళలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.



తొలుత ఒక ఆధార్ కార్డు ఉంటేనే రుణమాఫీ అంటూ చెప్పిన బాబు.. తరువాత రేషన్ కార్డు ఉండాలని.. ఒక ఖాతాకు మాత్రమేనని.. అటు తరువాత గ్రామంలో ఉన్న వారికి మాత్రమేనని అంటూ బాబు రకరకాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేశాడన్నారు. చివరకు పొట్ట కూటి కోసం హైదరాబాద్ కు వెళ్లిన రైతులను అసలు రైతులే కాదంటూ బాబు దాటవేత ధోరణి అవలంభిచడన్నారు. హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉంటే వారు అసలు రైతులు కాదనడం ఎంత వరకూ సమంజమని జగన్ ప్రశ్నించారు. మరి చంద్రబాబుకి పాన్ కార్డుతో సహా అన్ని కార్డులు హైదరాబాద్ లో ఉన్నా ఆయన ఏపీకి సీఎం కాలేదా? అని జగన్ నిలదీశారు.రైతులకు ఒక మాట.. ఆయనకొచ్చేసరికి మరోమాట మాట్లాడే నైజం చంద్రబాబుదన్న విషయం బహిర్గతమైందన్నారు.


 


చంద్రబాబు సీఎం కాక ముందు రైతు రుణాల రూ. 87 వేల కోట్లు ఉండగా, డ్వాక్రా రుణాలు రూ. 14, 204 కోట్లు ఉంది. అన్నీ తెలిసి ఆయన రాష్ట్రాన్నివిడగొట్టారు. తన మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని లిఖిత పూర్వకంగా చెప్పారన్న సంగతిని జగన్ గుర్తు చేశారు. రుణాలు మాఫీ చేస్తానని కూడా ఎన్నికల కమిషన్ లేఖ రాయడమే కాకుండ, ఒక వేళ ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతీ నిరుద్యోగికి భృతి కింద రూ.2 వేలు ఇస్తానన్న బాబు చెప్పిన మాట వాస్తవం కాదా?అని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగమే పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. రైతు రుణాలు రూ. 56 వేల కోట్లు ఉంటే రూ. 13 వేల కోట్లకు తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబేనని జగన్ పేర్కొన్నారు. పొరపాటును కూడా చంద్రబాబు నిజం చెప్పరని.. మద్యపానం నిషేధిస్తానని గతంలో చంద్రబాబు అధికారంలోకి రాగా, ఇప్పుడు పూర్తి మోసపూరితమైన వాగ్దానాలతో అధికారం చేపట్టారన్నారు. అంతా చేయి చేయి కలిపి బాబు మెడలు వంచుదామన్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్రం అతాలకుతలం అయ్యేలా ఉద్యమం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top