ఉత్సాహంగా పని చేయండి


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రజల కోసం, పార్టీ కోసం ఉత్సాహంగా పని చేస్తూ అందరి భాగస్వామ్యంతో  పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  జిల్లా పార్టీ నేతలకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యకలాపాలపై పోరాడాలన్నారు. కొత్తగా నియమితులైన జిల్లా కమిటీ, అనుబంధ కమిటీ, మండల పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు  వారిని పరిచయం చేశారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కర్నీ పలకరిస్తూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

 

 పజలకు అండగా ఉండాలని భుజం తట్టి పార్టీ కేడర్‌ను ఉత్తేజ భరిచారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి పని తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధ్యక్షుడైన తర్వాత పార్టీకి మరింత ఊపు వచ్చిందని వివరించారు. దీంతో వీరభద్రస్వామిని అధినేత వైఎస్ జగన్ అభినందించారు.  సుమారు 500 మంది నాయకులు తరలివెళ్లడంతో లోటస్ పాండ్ వద్ద  జిల్లా నేతల సందడి పెద్ద ఎత్తున కన్పించింది. జై జగన్ నినాదాలతో పార్టీ కార్యాలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు  బెల్లాన చంద్రశేఖర్, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, సూర్యనారాయణరాజు(పులిరాజు),

 

 రాష్ట్ర బీసీ సెల్ బర్రి చిన్నప్పన్న, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి సుంకరి రమణమూర్తి, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ,  వైఎస్సార్‌సీపీ  జిల్లా మహిళా శాఖ అధ్యక్షులు రెడ్డి పద్మావతి,  పార్టీ జిల్లా నేతలు పతివాడ అప్పలనాయుడు, వర్రి నర్సింహమూర్తి, తాడ్డి కృష్ణారావు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, వాకాడ శ్రీను, వలిరెడ్డి శ్రీనివాసరావు, జరజాపు ఈశ్వరరావు, పిన్నింటి వెంకటరమణ, గర్బాపు ఉదయభాను,  తెంటు సత్యంనాయుడు, రావాడ బాబు, సిరుగుడి గోవింద ఆశపు వేణు, జమ్ము శ్రీను, ఎస్‌వి రాజేష్, సూరపు రాజు, ఆర్‌కే రామకృష్ణ, మజ్జి వెంకటేష్, కడుబండి రమేష్,  దేముడు, బంటుపల్లి వాసుదేవరావు, బుగత రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top