ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరం


అగ్రిగోల్డ్ పేరుతో జరిగినది వేల కోట్లతో కూడిన అతిపెద్ద స్కాం అని, ఇందులో 20 లక్షల కుటుంబాలకు నెత్తిన టోపీ పెట్టారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంస్థ భూములు, ఇతర ఆస్తులను వేలం వేసి మొత్తం బాధితులందరికీ వాళ్ల సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు, తనకు బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపై ఆయన ఏమన్నారంటే...


  • ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును అంతా చూసే ఉంటారు
  • ఇంత దారుణమైన కౌరవ సభ దేశంలో ఎక్కడా ఉండి ఉండదు
  • సాక్ష్యాధారాలు చూపిస్తూ, 20 నిమిషాల టైం ఇవ్వండి, ఆధారాలతో నిరూపిస్తానన్నాను
  • అగ్రిగోల్డ్ సమస్య నాకు.. పుల్లారావుకు మధ్య వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను
  • ఆ టైం ఆయన ఇచ్చి ఉంటే ఈ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు
  • నేను చూపుతున్న ఈ ఆధారాలతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నాను
  • బాధితులే ఈ ఆధారాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారు.. ఇవేవో నేను తెచ్చినవి కావు
  • ఈ ఆస్తులన్నీ బయటకు వెళ్లిపోతే తమకు డబ్బులు రావని.. పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని చెప్పారు
  • అందుకే ఈ ఆధారాలను మాకు తీసుకొచ్చి ఇచ్చారు
  • మాకు ఇవ్వాల్సిన సొమ్ము రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు
  • కానీ గురువారం అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతుంటే మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేశారు
  • ఆడవాళ్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించిన ప్రెస్‌మీట్ వీడియోను ప్రదర్శించి చూపించారు
  • అంత దారుణంగా విషయాన్ని డైవర్ట్ చేశారు
  • ఈరోజు కూడా అలాగే జరిగింది.. ఆధారాలు ఉన్నాయి, చూపిస్తానంటే అవకాశం ఇవ్వలేదు
  • వాళ్ల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే గద్దల మాదిరిగా తన్నుకుపోతోంది
  • ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాకు చాలెంజ్ చేస్తారు
  • 20 లక్షల కుటుంబాలకు టోపీ పెట్టి, వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం
  • ఈ స్కాంలో పుల్లారావు అనే వ్యక్తి చిన్న చీమలాంటి వారు
  • ఈయన లాంటివాళ్లు చాలామంది పెద్దమనుషులున్నారు.. వాళ్ల పేర్లు బయటకు రావాలి
  • ఆ పెద్దమనుషుల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి
  • వాటిని మళ్లీ అటాచ్‌మెంట్‌లోకి తీసుకొచ్చి, డిపాజిట్ దారులకు మేలు జరిగేలా చూడాలి
  • ఆస్తులను అమ్మి వాళ్లకు డబ్బులు ఇప్పించాలి
  • మాట్లాడలేని ఆ గొంతుకలను నేను అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేశాను
  • దానికి నాకు, పుల్లారావుకు మధ్య ఏదో గొడవ ఉన్నట్లు చూపించారు
  • సభలో ఆయనైనా ఉండాలట.. లేకపోతే నేనైనా ఉండాలట.
  • అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు మంచి ఏమైనా జరుగుతుందా?
  • ఆరోపణలు వినాలన్న ఉద్దేశం లేదు గానీ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు
  • దేశంలో బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల మీద విచారణ ఎలా మొదలైంది.. ప్రతిపక్షాలు తమవద్ద ఉన్న ఆధారాలను పార్లమెంటులో ప్రస్తావిస్తే చర్చ జరిగి ఆ తర్వాత విచారణ జరిగింది, అప్పుడే స్కాంలు బయటకు వచ్చాయి
  • ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించడానికి అసెంబ్లీలో 20 నిమిషాల సమయం అడిగినా ఇవ్వకుండా చాలెంజ్ అనే కొత్తపేరు తీసుకొచ్చారు
  • ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. చాలెంజ్ మీద నమ్మకం ఉంటే ఇదే సభలో ఎన్నిసార్లు మేం చాలెంజ్ చేశాం.. ఆయనేమైనా స్పందించారా?

     
  • 21 మంది మా శాసన సభ్యులను కండువాలు కప్పి మీవైపు కూర్చోబెట్టుకున్నావు
  • ఆ 21 మంది నీ పార్టీ గుర్తుతో గెలవలేదు.. వాళ్ల మీద అనర్హత వేటు పడకుండా సీఎం, స్పీకర్ కలిసి నాటకం ఆడుతున్నారు
  • వాళ్లంతా అధికారపక్షం బెంచీలలో కూర్చున్నారు. వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు
  • ప్రజల మీద నమ్మకం ఉంటే, వాళ్లపై అనర్హత వేటు వేసి, నీ పార్టీ గుర్తుమీద వాళ్లను పోటీ చేయించు
  • ప్రజలిచ్చే మాండేట్‌ను రిఫరెండంగా తీసుకుందాం.. మాకు మెజారిటీ వస్తే దాన్ని ప్రజాతీర్పుగా తీసుకొమ్మని సవాలు చేశాం
  • తెలంగాణలో కోట్ల రూపాయల లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు
  • సుప్రీంకోర్టు ఆ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు చంద్రబాబుది కాదని నిరూపించగలరా అని చాలెంజ్ చేశాం.. వినలేదు
  • ఆయన చాలెంజ్ తీసుకోరు గానీ, అవతలి వాళ్లు మాత్రం రెచ్చిపోయి, చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే ఏదో తప్పు చేసినట్లు అవుతుందట
  • అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఆరోపణలు వచ్చినప్పుడు సాక్ష్యాలలో పస ఉంటే విచారణ పిలిపించాలి
  • 16 ఎకరాల హాయ్‌ల్యాండ్ భూములను ఎందుకు వేలం వేశారో ఎవరికీ తెలియదు
  • విలువైన ఆస్తులు ఎందుకు బయటకు రావడం లేదో ఎవరికీ అర్థం కావట్లేదు
  • ఎంపీలకు హస్తం ఉందని, చంద్రబాబు కొడుక్కి కూడా హస్తం ఉందని ఆరోపణలున్నాయి
  • ఇప్పటివరకు అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది కేవలం 16 కోట్లు మాత్రమే
  • కేవలం 1152 కోట్లు ఇస్తే మొత్తం 14 లక్షల మందికి పైగా ఉన్న బాధితులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు
  • కానీ చంద్రబాబుకు మాత్రం ఈ విషయాలేవీ పట్టవు
  • అగ్రిగోల్డ్ గురించి మాట్లాడకుండా ఎలా కట్టడి చేయాలని మాత్రమే ఇలాంటి తీర్మానాలు చేస్తారు
  • ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారు. చైర్మన్, ఆయన తమ్ముడు మాత్రమే
  • ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు.. అంతా కంపెనీలలో ఉంటూ ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి, వాటితో బయట ఆస్తులు కొన్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాను
  • ఒక్క ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే కాదు, తిరుపతిలో 14.5 కోట్లకు ఒకటిన్నర ఎకరాల భూమిని అమ్మేశారు
  • బ్రహ్మంగారి మఠంలో వాళ్లకున్న భూములను అమ్ముకున్నారని, 2016లో కూడా జరిగిందని చెప్పాం
  • ఇన్ని జరుగుతుంటే, వీటిని వినాలన్న ఉద్దేశం లేదు
  • ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ దినకరన్
  • ఆయన అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు
  • ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో 2010 మార్చి 8 నుంచి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు
  • ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు.. రామవ్వాస్ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు
  • ఒకవైపు అగ్రిగోల్డ్ ప్రజలకు టోపీ పెడుతోందని ఆరోపణలు వస్తున్నా, 2014లో ఈయన భూములు కొనుగోలు చేశారు
  • వెంకట కృష్ణ ఆంజనేయ ప్రసాద్ నుంచి దినకరన్ 2014 జూలైలో కొన్నారు
  • ఆ తర్వాత.. అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 2015 జనవరి4న పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో కేసులు నమోదయ్యాయి
  • ఇదే హాయ్‌ల్యాండ్‌లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ 19వ తేదీన ప్రత్తిపాటి పుల్లారావుకు భూములు అమ్మారు
  • ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ.. ఉదయ్ దినకరన్ నుంచి భూములు కొన్న సేల్ డీడ్ కాపీ కూడా ఉంది
  • స్పెక్ట్రం కేసులోను, కోల్ స్కాంలోను, బోఫోర్స్ స్కాంలోను ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయో నాకు తెలియదు గానీ, వాటి మీద సీబీఐ విచారణ జరిగింది
  • ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తున్నాను.. సీఐడీ విచారణ వద్దు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది
  • హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలి
  • అది జరిగినా కూడా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు నష్టం మాత్రం జరగకూడదు.
  • ఒక్క పుల్లారావే కాదు.. గద్దలు అందరిమీద విచారణ చేసి, ఆస్తులన్నింటినీ వెనక్కి తీసుకొచ్చి వాటిని రీ ఎటాచ్ చేసి, వాటిని వేలం వేయగా వచ్చిన డబ్బును డిపాజిట్‌దారులకు అందజేయాలి

     
  • ఈ విషయాలు చెప్పడానికి 20 నిమిషాల సమయం అడిగితే ఇవ్వలేదు
  • నేనేమైనా సీబీఐ అధికారినా, పోలీసునా.. నేను పిలిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు ఏమైనా వస్తారా..
  • ఇది 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్యే తప్ప జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను
  • అందరి సంక్షేమం కోసం 20 నిమిషాల సమయం ఇవ్వమని అడిగితే వెంటనే మైక్ కట్ చేసేస్తున్నారు
  • ప్రజాస్వామ్యంలో స్పీకర్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలియాలి
  • స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేముందు 14 రోజుల సమయం ఉండాలని నిబంధనలు ఉన్నాయి
  • కానీ ఇంతకుముందు స్పీకర్ దాన్ని తోసిపారేసి.. వెంటనే అవిశ్వాసం చేపట్టారు
  • ఎందుకంటే, 21 మంది సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం మాకు ఇవ్వకూడదని
  • ఇప్పుడు కూడా దాదాపు అలాగే చేస్తారు.. తీర్మానం వీగిపోయేలా చేస్తారు
  • అయినా అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఎందుకంటే, ఈ సభలో ఉన్నది మనుషులు కారు, రాక్షసులని ప్రజలకు తెలియాలి
  • చివరకు ప్రజలు మొట్టికాయలు వేస్తారు, పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేయాల్సిందే


రుణమాఫీపై అసెంబ్లీలోనూ అబద్ధాలే

ఆ తర్వాత రైతు రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో చెప్పిన విషయాలు, వాటిలోని అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా జగన్ నిరూపించారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ కుటుంబానికి చెందిన మూడు రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయినట్లు మంత్రి చెప్పారని, కానీ అదంతా పచ్చి అబద్ధమని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. ఈ సందర్భంలో జగన్ ఏమన్నారంటే..

  • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి
  • ఆయన కట్టొద్దన్నందుకు రైతులు ఆ రుణాలు కట్టలేదు, దాంతో వారికి బ్యాంకులు అపరాధ వడ్డీ వేస్తున్నాయి
  • వీళ్లు ఏడాదికి 3500 కోట్లు ఇస్తూ మొత్తం రుణమాఫీ చేసేశామంటున్నారు
  • దాదాపు 40 లక్షల రైతుల అకౌంట్లు ఎన్‌పీఏలుగా బ్యాంకులు ప్రకటించాయి
  • మరోవైపు రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతోంది.. ఇప్పుడు దాదాపు 1.05 లక్షల కోట్లకు చేరుకుంది
  • కరణం ధర్మశ్రీకి 1.36 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు
  • విషయం ఏమిటంటే.. ప్రత్తిపాటి పుల్లారావు మూడు సందర్భాలు ప్రస్తావించారు
  • ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి 49 సెంట్ల భూమి పెట్టి 2007లో 35 వేలు తీసుకున్నారని, కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అంత రాదని చెప్పారు
  • వడ్డీతో కలిపి ఇది 70వేలు అయ్యిందని చెప్పారు, దీనికి 13794 రుణమాఫీ చేశామని చెప్పారు
  • విజయలక్ష్మికి మొత్తం 4 ఎకరాల భూమి ఉంది
  • రెండు విడతలుగా ఆమెకు మొత్తం 5793 రూపాయలు మాత్రమే ఇప్పటికి మాఫీ అయింది
  • రెండో కేసు.. ధర్మశ్రీ పేరుతో ఉన్నది 2013లో 50 వేల రుణం
  • దీనికి మొత్తం రుణమంతా మాఫీ అయిపోయిందని పుల్లారావు చెప్పారు
  • మొదటి దఫా 10 వేలు ఇచ్చారు. అందులో అసలు 3200, ఇంకా వడ్డీ ఉన్నాయి
  • రెండోదఫాలో 11వేలు ఇచ్చారు..
  • ఈవాల్టికి 46వేలు, దానిపై వడ్డీ కలిపి 51వేల రుణం అలాగే ఉంది
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top