తమ్మినేనికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాంను ఫోన్లో పరామర్శించారు. తమ్మినేని కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం తల్లి ఇందుమతమ్మ గత అర్థరాత్రి ఆముదాలవలస మండలం స్వగ్రామం తొగరంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.