4న జిల్లాకు జగన్

4న జిల్లాకు  జగన్ - Sakshi


బ్రాండెక్స్ కార్మికులకు సంఘీభావం

కార్మికులతో ముఖాముఖీ


 

 సాక్షి, విశాఖపట్నం:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4న జిల్లాలో పర్యటించ ను న్నారు. బ్రాండెక్స్ కార్మికుల ఉద్యమానికి ఈ పర్యటనలో ఆయన సంఘీభావం తెలుపుతారు. పర్యటన వివరాలను పార్టీ జిల్లా అ ద్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడిం చారు. 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా మిందిలోని పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇంటికి వెళ్తారు.



అక్కడ భోజనం అనంతరం బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అచ్యుతాపురం చేరుకుంటారు. తొలుత బ్రాండెక్స్ కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీలో పాల్గొంటారు. వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 5.30 గంటలకు విమానంలో హైదరబాద్ పయనమవుతారు.





 సమస్యలు జగన్‌కు చెప్పండి..అసెంబ్లీలో చర్చిస్తారు: ప్రగడ

అచ్యుతాపురం: ఇటీవలే కనీస వేతనాల పెంపు, పీఎఫ్ అమలు డిమాండ్‌తో గత నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న బ్రాండెక్స్ కార్మికులు తమ సమస్యలను ఈ నెల 4న అచ్యుతాపురం వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలనివైఎస్సార్‌సీపీ యలమంచలి కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు కార్మికులకు సూచించారు. బ్రాండిక్స్ కంపెనీ ప్రారంభించినప్పటికీ వేతనాలు పెంచక పోవడంతో కార్మికులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడు తున్న వైనాన్ని ఇటీవలే తాను హైదరాబాద్‌లో కలిసిన ప్పుడు జగన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు.



కడుపు మండి రోడ్డెక్కి ఉద్యమిస్తుంటే అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కూడా వివరించానన్నారు. మేడే సందర్భంగా బ్రాండెక్స్ కార్మికుల అంశాన్నే జగన్ ప్రధానంగా ప్రస్తావించారని ప్రగడ గుర్తు చేశారు. అచ్యుతాపురం రానున్న జగన్ ఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను, మూతపడిన కారణంగా ఇబ్బందిపడుతున్న కార్మికుల సమస్యలను అడిగి తెలసుకుంటారని చెప్పారు. సెజ్‌కు సంబంధించి అన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఈ భేటీలో ఎక్కువ మంది కార్మికులకు ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సమావేశానికి కార్మికులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top