మీ వెంటే ఉంటా..


సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వర్షాలు అన్నిచోట్లా కురిశాయి. పంటలు పాడైపోయి రైతులు అల్లాడిపోతుంటే ఇంకా అంచనాలేంటి. సీఎం చంద్రబాబునాయుడును నిలదీయండి. మీ వెంట నేనుంటా. మొద్దు సర్కారుపై పోరాడదాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించేందుకు శుక్రవారం తణుకు మండలం దువ్వ గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్ అక్కడి పొలాలను పరిశీలించారు.



మోకాల్లోతు బురదలో దిగి పాడైపోయిన పంటలను పరిశీలించారు. ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ‘చంద్రబాబు ఇక్కడకు వచ్చారా.. కనీసం ఇక్కడి ఎమ్మెల్యే అయినా వచ్చారా’ అని ప్రశ్నించారు. ‘లేదు.. కనీసం స్థానిక నాయకులు, అధికారులు కూడా రాలేదు’ అంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పా రు. ఇందుకు జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అపార నష్టం జరిగి అన్నదాతలు నిలువునా నష్టపోయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు.



కనీసం రైతులకు భరోసా కలిగిం చేలా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారు ణం. మీరు, నేను కలిసి పోరాడదాం. మొద్దు సర్కారు మెడలు వంచుదాం’ అని జగన్ అన్నారు. రైతుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వా న్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.

 

తూర్పుగోదావరి జిల్లా నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు సిద్ధాంతం వద్ద జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌కు  ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ నేరుగా దువ్వ గ్రామానికి చేరుకుని ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంట చేల వద్దకు వెళ్లారు. మోకాల్లోతు బురద ఉన్నా లెక్కచేయక పొలాల్లోకి దిగారు.



జగన్ రాకకోసం అక్కడ వేచిచూస్తున్న వందలాదిమంది రైతులతో మాట్లాడారు. ‘రంగుమారిన ధాన్యం ఉంది. పనల మీద తడిసిన ధాన్యం ఉంది. మొలకలొచ్చిన ధాన్యం ఉంది. వీటన్నిం టికీ పరిహారం ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాం డ్ చేద్దాం’ అని పిలుపునిచ్చారు.

 

ఇప్పటికీ రుణమాఫీ కాలేదన్నా..

నేలవాలిన వరి పంటను పరిశీలిస్తుండగా.. కౌలు రైతులు తోరాటి శ్రీనివాస్, కడియం ప్రసాద్ పరుగు పరుగున వచ్చి.. ఇది తాము సాగుచేసిన ఏడెకరాల పొలమని వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మేం రైతుమిత్ర గ్రూపు ద్వారా చెరో రూ.30 వేల రుణం తీసుకున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే నిజమే అనుకున్నాం. ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం గానీ రుణాల మాఫీ కాలేదు’ అని చెప్పుకొచ్చారు.



‘ఇప్పుడు వర్షాల దెబ్బకు పంటలు దెబ్బతిని నష్టపోయాం’ అని వాపోయారు. మరో రైతు అడ్డాల కోటేశ్వరరావు వైఎస్ జగన్‌ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. రోడ్డుమీద వేసిన పనలను చూపిస్తూ వర్షాలకు ఇలా నష్టపోయామ య్యా అని ఆవేదన చెందారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ఇది మోసకారి సర్కారు.. అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.  



కాసాని రంగా, గూడుపు దానయ్య అనే రైతులు రోడ్డుకు దూరంగా ఉన్న తమ పొలాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి చూపించారు. రోడ్డు వెంబడి పొలాల్లో జరి గిన నష్టాన్నే అంచనా వేస్తున్న అధికారులు తమ పొలాలు చూసేందుకు రాలేదని వివరించారు. జగన్ స్పందిస్తూ.. ‘వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయని తెలుసు. ఇంకా లెక్కలేంటి’ అని వ్యాఖ్యానించారు.

 

దానేశ్వరి అమ్మవారి సన్నిధిలో..

 దువ్వ గ్రామంలోలోని దానేశ్వరి అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు.

 

అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపిన వైఎస్ జగన్

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు, రైతులను పరామర్శిం చేందుకు వచ్చిన వైఎస్ జగన్‌కు అన్నదాతలు ఎక్కడికక్కడ నీరాజనం పలికారు. ‘కనీసం మా కష్టాన్ని చూసేందుకు ఇంతవరకు ముఖ్యమం త్రి రాలేదు. ఒకరిద్దరు మంత్రులు వచ్చినా గట్ల మీదనుంచే చూసి వెళ్లిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులూ పర్యటించలేదు. వైఎస్ జగన్ నేనున్నాంటూ ముందుకొచ్చి భరోసా నింపా రు’ అని రైతులు హర్షం వ్యక్తం చేశారు.



తూర్పుగోదావరి జిల్లా  నుంచి సిద్ధాంతం మీదుగా దువ్వ గ్రామానికి చేరుకున్న జగన్ పొలాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోంచి జాతీయ రహదారిపైకి చేరుకునేందుకు రెండు గంటలకుపైగా సమయం పట్టింది.  కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్రమంలో ఎక్కడికక్కడ తన కోసం బారులుతీరిన మహిళలు, యువకులు, వృద్ధులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఊరు ప్రారంభంలో నాగలక్ష్మి అనే మహిళ ఆయనకు బొట్టు పెట్టి ఆహ్వానించారు.



పర్యటన ముగించుకుని తిరిగి రాజమండ్రి వెళ్తుండగా, తణుకు అడ్డరోడ్డు వద్ద తన కోసం వందలాది మంది వీఆర్‌ఏలు  వేచి చూస్తున్నారని తెలిసి వైఎస్ జగన్ వాహనం దిగి వెళ్లి వారితో మాట్లాడారు. వినతిపత్రం స్వీకరిం చారు. వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.



దీంతో వీఆర్‌ఏలు ‘వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు తానేటి వనిత, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, ఘంటా మురళి, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తోట గోపీ, చీర్ల రాధయ్య, పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్  ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి గోలి శరత్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొద్దాని శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన  కార్యదర్శి  పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి ముక్కు కాశిరెడ్డి, యువజన విభాగం నేత చిట్టిబొమ్మ పవన్, పార్టీ సంయుక్త కార్యదర్శి పసుపులేటి శేషు పాల్గొన్నారు.

 

అందరినీ పలకరిస్తూ.. ఓపిగ్గా సమస్యలు వింటూ..

పొలాల నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గ్రామంలో రోడ్డు వెంబడి తన కోసం ఆగి ఉన్న ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. కరచానం చేశారు. ‘అక్కమ్మా.. చెల్లెమ్మా.. చిన్నమ్మా, అవ్వా, తాతా’ అంటూ అందరితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన కోసం వేచిచూస్తున్న వృద్ధారాలు కొఠారు మహాలక్ష్మిని చూసిన జగన్ కారు దిగి వెళ్లారు. ఆయ నను చూసి చలించిపోయిన ఆమె తన బాధలను చెప్పుకుంది. అర్హత ఉన్నా అధికారులు తనకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయింది.



ఇందుకు జగన్ స్పందిస్తూ.. పింఛను రాకుంటే కోర్టులో కేసువేద్దామని భరోసా ఇచ్చారు. ఊళ్లో చెరువు పరిస్థితి బాగోలేదని, తాగునీటికి, పశువుల స్నానాలకు, దుస్తులు ఉతికేందుకు అన్నింటికీ ఒక్కటే చెరువు వాడుతున్నారని మహిళ మంగతాయారు వాపోయింది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ ప్రభుత్వంలో అన్నీ ఇలానే ఉంటాయమ్మా..’ అంటూ పక్కనే ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కారుమూరి నాగేశ్వరరావుకు ఈ సమస్యపై పోరాడాల్సిందిగా సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top