ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు

ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు - Sakshi


హైదరాబాద్ : ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. రుణాల మాఫీపై కోట్లాది మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టిన 2014-15 సంవత్సరం సాధారణ బడ్జెట్‌పై జగన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలే రూ.1.02 లక్షల కోట్లు ఉన్నారుు. ఇవి కాక చేనేత కార్మికుల రుణాలూ ఉన్నారుు.



ఈ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. బడ్జెట్‌లో ఇందుకోసం చేసిన కేటాయింపులు సున్నా’’ అని విమర్శించారు. ‘‘చంద్రబాబు తొలి సంతకంతోనే రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. కానీ 1.02 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలుంటే కేటాయింపులు మాత్రం లే వు. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, చేనేత కార్మికులతో సహా ప్రజలందరినీ ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచింది. గృహ నిర్మాణానికి రూ. 800 కోట్లు కేటాయించడం అతి దారుణంగా ఉంది. వైఎస్ హయాంలో ప్రతి ఏటా బలహీనవర్గాల గృహ నిర్మాణానికి 7 వేల నుంచి 8 వేల కోట్ల రూపాయలు కేటాయించేవారు. ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు కేటారుుంపులు 800 కోట్ల రూపాయలకు దిగజారారుు. ఈ కేటారుుంపులు చూస్తే ఈ ఏడాది బలహీనవర్గాల వారికి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించబోరనేది స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ‘‘ఈ బడ్జెట్‌లో ప్రణాళిక కేటాయింపులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రణాళిక కేటాయింపులు ఎంత ఎక్కువగా ఉంటే అంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గత పదేళ్ల చరిత్ర చూస్తే రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 33 నుంచి 36 శాతం మేరకు ప్రణాళిక కేటారుుంపులు ఉండేవి. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో అది 24 శాతం మాత్రమే ఉంది. ప్రణాళిక కేటారుుంపులు పెరిగితే అభివృద్ధి పెరిగి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ఉంటుంది. జీడీపీ రేటు పెరుగుదలపై ప్రభావం చూపే మరో అంశం పెట్టుబడి వ్యయం. సాధారణంగా అయితే పెట్టుబడి వ్యయం 11 శాతం నుంచి 12 శాతంగా ఉంటుంది. అదిప్పుడు 6.3 శాతానికి పడిపోయింది. ప్రణాళిక కేటారుుంపులు, పెట్టుబడి వ్యయం రెండూ తగ్గిపోవడం వల్ల జీడీపీ దారుణంగా పడిపోతుంది’’ అని జగన్ విశ్లేషించారు.



కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు వస్తాయా!



‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రెండు రకాల నిధులొస్తాయి. రాష్ట్రం వాటా కింద రావాల్సిన నిధులు కొన్ని అయితే, గ్రాంటు కింద వచ్చేవి రెండో తర హావి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గత ఏడాది రూ. 15,000 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎరుుడ్‌గా వచ్చాయి. ఇందులో సీమాంధ్రకు రూ. 9,000 కోట్లు వచ్చారుు. ఇవికాక పన్నుల నుంచి ఉమ్మడి రాష్ట్రం వాటాగా వచ్చినవి మరో రూ. 12,000 కోట్లు ఉన్నారుు. ఉమ్మడి రాష్ట్రంలోనే కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎరుుడ్ రూపంలో 15 వేల కోట్ల రూపాయలు వస్తే ఇప్పుడు విభజిత రాష్ట్రానికే రూ. 29 వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపడం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా కేంద్రం ఇన్ని నిధులు ఇస్తుందా’’ అని జగన్ ప్రశ్నించారు.    

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top