జననేతకు జేజేలు

జననేతకు జేజేలు - Sakshi


ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

అన్నదానాలు, రక్తదాన శిబిరాలు

రోగులకు పండ్ల పంపిణీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు




చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్, పండ్లు,పాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు, దుప్పట్లు, టవల్లు అందజేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



తిరుపతిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాజం పేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. నవజీవన్ కంటి ఆస్పత్రిలో అంధ విద్యార్థులకు కరుణాకరరెడ్డి పండ్లు పంపిణీ చేశారు.



చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి రూరల్ అక్షయక్షేత్రలో పార్టీ నేతలు మానసిక వికలాంగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.

     

పీలేరు నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో అన్ని మండలా ల్లో కేకులు కట్ చేసి స్వీట్లను పంచారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.  



చిత్తూరులో న్యూట్రిన్ ఫ్యాక్టరీ వైఎస్సార్‌టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నగర పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి పాల్గొన్నారు.

     

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేశారు. స్వీట్లు పంచారు. కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

     

కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.

     

పలమనేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ స్థానిక నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

     

మదనపల్లె నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జగన్ జన్మది న వేడుకలను ఘనంగా నిర్వహించారు. మదనపల్లె లో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సోదరుడు జయదేవ్‌రెడ్డి కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశా రు.  మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

     

పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లాపరిషత్ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ షమీమ్ షరీఫ్ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది రోగులకు బ్రెడ్లు, పండ్లు, పాలు పంపిణీ చేశారు.

 

నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అన్నదానం చేశారు. ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. హాస్టల్‌లో 500 మంది పిల్లలకు టవళ్లు పంపిణీ చేశారు.

     

సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నారాయణవనం సొరకాయలస్వామి ఆలయంలో అభిషేకం, పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.

     

నగరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వే డుకలు జరిగాయి. కేకులు కట్ చేసి స్వీట్లు పంచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

     

పూతలపట్టు నియోజకవర్గంలోని మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. బంగారుపాళెం మండలంలో మిథున్ యువసేన జిల్లా అధ్యక్షులు కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top