రేపు వైఎస్ జగన్ గన్నవరం రాక

రేపు వైఎస్ జగన్ గన్నవరం రాక - Sakshi


వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు వెళ్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొంటారని వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top