పరిశోధనల వైపు యువత అడుగులేయాలి


 ఒంగోలు  :

 సమాజానికి సవాల్‌గా మారిన అంశాలకు పరిష్కారం కనుగొనే దిశగా నేటి యువత పరిశోధనలు చేయాలని చెన్నైకి చెందిన డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ అన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన పరిశోధనల వైపు యువత అడుగులేయాలి

 

 జాతీయ యువజన సైన్స్ కాంగ్రెస్‌కు హాజరైన స్వామినాధన్ చెన్నైకి తిరుగు ప్రయాణంలో బుధవారం ఒంగోలులోని ఓ ప్రయివేటు వైద్యశాలలో విశ్రాంతి నిమిత్తం ఆగారు. ఈ సంధర్బంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మిర్చిలో చీడ పీడలను తట్టుకుని నిలబడే అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు సాగులో సాంకేతిక పరి జ్ఞానం అందిస్తే మంచి దిగుబడులను ఆశించవచ్చన్నారు. ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల విధ్యార్థులతో రీసెర్చ్ జర్నీ సంస్థను నెలకొల్పి పరిశోధనల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వాత్సల్య ఆసుపత్రి డాక్టర్ ఎ.వి. సుందరరావు, ఫౌండేషన్ ఆర్గనైజింగ్ కార్యధర్శి ఎం.రవిబాబులు ఈయన్ని సాదరంగా ఆహ్వానించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top