రాజన్నకు ఘననివాళి

రాజన్నకు ఘననివాళి - Sakshi


సాక్షి, నెల్లూరు:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, వైఎస్సార్ అభిమానులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు వాడవాడలా జరిగాయి.

 

 తమ కోసం వైఎస్సార్ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పిలుపుమేరకు గాంధీబొమ్మ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో పాటు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

 

  నగరంలోని ప్రతి డివిజన్‌లోనూ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు, అన్నదానం జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి సమర్పించారు.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.

 

 బుచ్చిరెడ్డిపాళెంలో పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దామరమడుగు, పెనుబల్లి, రెడ్డిపాళెంలో అన్నదానం నిర్వహించారు. ఇందుకూరుపేటలో మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కోవూరులోనూ పార్టీ నేతలు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. విడవలూరు, కొడవలూరులో ఆయా మండలాల కన్వీనర్లు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య ఆధ్వర్యంలో ైవె ఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు.

 

  ఉదయగిరిలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎల్.ప్రవీణకుమారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. వింజమూరులో ఎంపీపీ గణపం బాలకృష్ణారెడ్డి, దుత్తలూరులో ఎంపీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. జలదంకిలో దివంగత నేత విగ్రహానికి ఘననివాళులర్పించారు.

 

 ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బోయలచిరువెళ్ల, మర్రిపాడు మండలం చినమాచనూరు, చేజర్ల మండలం మావులూరులో విగ్రహాలకు నివాళులర్పించడంతో పాటు అన్నదానం నిర్వహించారు.

 

 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విగ్రహాలకు క్షీరాభిషేకం చేయడంతో పాటు వైద్యశిబిరాలు, అన్నదానం తదితర కార్యక్రమాలు చేపట్టారు.  సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేయడంతో పాటు ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.

 

 కావలిలో వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గోసల గోపాలరెడ్డి, రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోగోలులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తూపిలి పెంచలయ్య, ఎంపీపీ పర్రి సులోచనమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు బాపట్ల కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

 అల్లూరులో జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ గంగపట్నం మంజుల, సర్పంచ్ చంద్రలీలమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ షరీఫ్ తదితరులు హాజరయ్యారు. దగదర్తిలో పార్టీ మండల కన్వీనర్ గోగుల వెంకయ్య తదితరుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది.  వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు ఘననివాళులర్పించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top