ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
విజయనగరం: వేపాడ మండలంలోని కృష్ణారాయుడిపేట గ్రామంలోని గుంప సుజాత(30) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలను ఇరుగుపొరుగు వారు వివరిస్తూ... భర్త తాగుడు మాన్పించలేక జీవితంపై విసుగు చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆమె మృతికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
(వేపాడ)