భర్త చేత తాగుడు మాన్పించలేక....
వేపాడ(విజయనగరం): మండలంలోని కృష్ణారాయుడిపేట గ్రామంలో గుంప సుజాత(30) అనే వివాహిత ఉరేసుకుని తనువు చాలించింది. భర్త పక్కా తాగుబోతు. తాగుడు మాన్పించడానికి ఆమె చేయని ప్రయత్నంలేదు. అతను తాగుడు మానలేదు. దాంతో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది.
దాంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె మృతికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.