సేంద్రియ సాగు ఆరోగ్యకరం


  •      సుగంధ ద్రవ్యాలపై అధ్యయనం

  •      కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త నిర్మల్‌బాబు

  • చింతపల్లి: సేంద్రియ సాగులో విశాఖ మన్యంలోని చింతపల్లి అగ్రస్థానంలో నిలుస్తుందని,ఇక్కడి ఉద్యానవన పంటలకు మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ప్రా జెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ కె. నిర్మల్‌బాబు అన్నారు.



    నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్స్ అం డ్ స్పైస్ ఆలిండియా కో-ఆర్డినేటింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇక్కడ పండే సుగంధ ద్రవ్య ఉద్యాన పంటలపై అధ్యయనంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆంధ్రలో ప్రస్తుతం చింతపల్లి మినహా మరెక్కడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం లేదన్నారు. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నారని, ఇది మానవాళి మనుగుడకు సవాలుగా మారుతుం దన్నారు.



    ఇలాంటి పరిస్థితుల్లో చింతపల్లి ప్రాం తంలో గిరిజనులు సేంద్రియ పంటలను పం డించడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగంలో గుంటూరు అగ్రస్థానంలో ఉందని, రెట్టిం పు దిగుబడుల కోసం ఈ పద్ధతులను అనుసరిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్నారు. ఐస్‌క్రీంల తయారీకి విని యోగించే వెనీల ఒకప్పుడు విదేశాల్లో పండేద ని, అక్కడ రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో మన దేశంలో సేంద్రియ పద్ధతులలో సాగు చేపట్టారన్నారు.



    దీంతో ఇక్కడ పండిన వెనీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఐదురెట్లు ధర లభించేదన్నారు. దీని వినియోగం పెరిగిన కొద్ది మన రైతులు కూడా రసాయనిక ఎరువులు విని యోగించడంతో ఇక్కడ పండిన వెనీలకు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా ధరలు పతనమైపోయాయని వివరించారు.  కార్యక్రమంలో స్థా నిక ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖరరావు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కో- ఆర్డినేటర్ శ్రీహరిబాబు, శాస్త్రవేత్తలు మల్లేశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్, జివి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

     

    చక్కెర వ్యాధిగ్రస్తులకు మన్యం జామ మంచిది

     

    మైదానంలో పండించే జామ తియ్యగా ఉంటుంది. ఏజెన్సీలో పండే జామ అంత తియ్యగా ఉండకపోవడం వల్ల వినియోగదారులు ఇక్కడ జామను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని శాస్త్రవేత్త నిర్మల్‌బాబు అన్నా రు. అయితే ఇక్కడ పండించే జామ డయాబెటిక్ రోగులకు మంచిదని ఈ విషయం తెలియకపోవడం వల్ల వినియోగదారులు ఆసక్తి చూ పడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రచారంలోకి తేవాలని, అప్పుడే ఇక్కడ జామకు కూడా మార్కెట్‌లో మంచి ధరలు దక్కుతాయన్నారు.



    మిరియాలలో అధిక దిగుబడులు ఇచ్చే రకాలను అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాస్త్రవేత్తలకు సూచించారు. గిరిజన రైతులు పండించే పసుపు, అల్లం పంటలను నాణ్యంగా తయారు చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలోని చిట్రాలగొప్పు, తాజంగి, దిగువపాకలలో రైతు లు పండిస్తున్న రోమా రకం పసుపు, మిరియా ల సాగును ఆయన పరిశీలించారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top