ఈఆర్‌సీ... ఇదేంటి?


 సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని కొన్ని అంశాలకు మార్పులను సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) రాసిన లేఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జెన్‌కోకు చెందిన జల విద్యుత్ కేంద్రాలపై చట్టంలో స్పష్టత లేదన్న ఈఆర్‌సీ.. ఇందుకోసం ఏకంగా చట్టాన్ని పునర్నిర్వచించాలని కోరడాన్ని న్యాయనిపుణులు తప్పు పడుతున్నారు. ఒక చట్టాన్ని తిరిగి నిర్వచించే పనిని పార్లమెంటు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. విభజన చట్టంలో ఇంధనరంగానికి సంబంధించి ఉన్న ఆరు అంశాల్లో మరింత స్పష్టత ఇచ్చి ఆ మేరకు మార్పులు చేయాలని సూచిస్తూ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కి, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలకు ఈఆర్‌సీ మంగళవారం లేఖ రాసింది. అయితే ఈఆర్‌సీ రాసిన లేఖలోనే స్పష్టత లేదని న్యాయనిపుణులంటున్నారు. అవసరమైన అంశాలను ప్రస్తావించకుండా ఇతర అంశాలను ప్రస్తావించిందని ఇంధనశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఎవరు సమీక్షించాలనే అంశాన్నీ కానీ, ఈఆర్‌సీ ఉద్యోగులను ఏ విధంగా విభజించాలి? వంటి అంశాల జోలికే పోలేదని ఈ వర్గాలు విమర్శిస్తున్నారుు. వాస్తవానికి ఒక విద్యుత్ ప్లాంటు నుంచి ఒకటికి మించి రెండు, మూడు రాష్ట్రాలు కనుక విద్యుత్‌ను తీసుకుంటున్నట్టరుుతే... ఆ విద్యుత్ ప్లాంటు టారిఫ్‌ను సీఈఆర్‌సీ నిర్ణయించాల్సి ఉంటుంది. విభజన జరిగిన తర్వాత జెన్‌కో, ప్రైవేటుకు చెందిన విద్యుత్ ప్లాంట్ల నుంచి ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర అంటే రెండు రాష్ట్రాలకూ విద్యుత్ సరఫరా అవుతుంది. అలాంటప్పుడు ఈ విద్యుత్ ప్లాంట్ల టారిఫ్‌ను ఎవరు నిర్ణరుుస్తారు, ఇతర సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు అనే అంశంపై స్పష్టత కోరాల్సి ఉందని ఇంధనశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top