‘బెల్ట్’ ఫైల్‌పై సంతకం ఏమైంది బాబూ


కురిచేడు: మండలంలోని ఎన్.ఎస్.పి.అగ్రహారం మహిళలు శనివారం బెల్టు తీసి కన్నెర్ర చేశారు. గ్రామంలో బెల్టుషాపులు నిర్వహించవద్దని, మద్యం విక్రయిస్తే సీసాలు ధ్వంసం చేస్తామని హెచ్చరించడమే కాదు గ్రామానికి చెందిన అచ్చనాల రమాదేవి బెల్ట్ ఫైల్‌పై సంతకం ఏమైంది బాబూ బడ్డీకొట్టులో మద్యం బాటిళ్లు పెట్టేందుకు కురిచేడు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి ఎదుటనే బాటిళ్లు పగ లగొట్టారు. అచ్చనాల అచ్చమ్మ, అచ్చనాల నరసమ్మ, కాట్రాజు సుబ్బులు, కాట్రాజు వెంకటలక్ష్మి, కాట్రాజు చిన్న, తాటి యోగమ్మ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు.



బెల్టుషాపుల రద్దు జీవో ఏమైంది

ఎంతో ఆర్భాటంగా బెల్టుషాపులు రద్దు చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన టీడీపీ నేతలు ఎందుకు బయటకు రాలేదని వీరంతా ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం తన తొలి సంతకం బెల్టుషాపుల రద్దు ఫైలుపై చేశామని గొప్పటు చెప్పుకుంటున్న వాళ్లు ఆప్పుడేమంటారని నిలదీశారు.  ప్రతి గ్రామంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు గత జన్మభూమి సభల్లో ప్రజలు మొరపెట్టుకున్నా వాటిని ఎందుకు సంబధితాధికారులు నిలువరించడం లేదని అన్నారు. ఎక్సైజ్ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా బెల్టుషాపుల వారికి ముందుగా సమాచారమిచ్చి ఆ తరువాత నామమాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.  

 

బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలి

- ఎంపీ వైవీ సుబ్బారెడ్డి


ఒంగోలు: నల్లమల అటవీ ప్రాంతంలో పెళ్లి లారీ బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  డిమాండ్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top