సిఎం గారూ రైతుగా 6 సందేహాలు

సిఎం గారూ రైతుగా 6 సందేహాలు


 1    రైతుల రుణమాఫీపై క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతా అయోమయం, గందరగోళంగా ఉంది.



 2    రుణమాఫీపై అబద్ధపు ప్రచారాలెందుకు? ఎర్రచందనం చెట్లను తాకట్టు పెడతామని, నదుల్లో ఇసుక తవ్వకాలపై సెస్ వేస్తామని.. ఇలా ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చి ఎందుకు మభ్యపెట్టాలనుకుంటున్నారు?



 3    పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. బ్యాంకర్లు మాత్రం కొత్త రుణాలు ఇవ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రుణమాఫీ ఎక్కడుంది?



 4    మీ హామీలు నమ్మి పాత రుణాలను బ్యాంకులకు చెల్లించలేదు. జూన్ 30వ తేదీలోపు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేది. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలంటున్నారు. ఉదాహరణకు అప్పట్లో రూ. 3,000 కడితే సరిపోయేది. ఇప్పుడు రూ.13,000 చెల్లించాలి. అదనంగా ఈ వడ్డీ ఎవరు కట్టాలి? మేమా.. లేక ప్రభుత్వం భరిస్తుందా? దయ చేసి స్పష్టత ఇవ్వండి.



 5    రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు?



 6    రుణమాఫీ అమలు అయిపోయినట్లే టీడీపీ సంబరాలు చేసుకుంది.  సీఎంగా మిమ్మల్ని అభనందించడానికి పోటీపడ్డారు. కానీ బ్యాంకులు రుణాలు కట్టాలని నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని నిక్కచ్చిగా చెబుతున్నాయి. ఇది న్యాయమా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top