షాడోను మించిపోయారు..

షాడోను మించిపోయారు.. - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడంతో షాడోనేత పీడ విరగడయిందని అంతా భావించారు. అయితే  వ్యక్తి మారాడు గాని, ఆ వ్యవస్థ మారలేదు. అప్పుడు ఒక్కరే రాజ్యాంగేతర శక్తిగా రెచ్చిపోయి అందినకాడికి దోచుకుంటే, ఇప్పుడు ఎక్కడికక్కడ షాడోనేతలు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. నిబంధనలు, విలువలను పక్కన పెట్టి నొల్లేసుకుంటున్నారు.  మొన్నటి వరకు షాడో నేత, ఆయన తోక నేతల దందా సాగగా, ఇప్పుడు టీడీపీ నేతల హవా మొదలైంది. షాడోనేతకు తీసిపోకుండా బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. టెండర్ల ద్వారా ఇవ్వవల్సిన మంచినీటి పథకాల నిర్వహణ పనులను నామినేటెడ్‌గా లాగేసుకుంటున్నారు.

 

 కోట్లాది రూపాయల పనులను అడ్డగోలుగా దక్కించుకుంటున్నారు. ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు పూర్తిగా సరెండరైపోయారు. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా షాడోనేత వ్యవహరిస్తున్నారంటూ  టీ డీపీ నాయకులు గతంలో విమర్శలు గుప్పించారు. ఆయన తీరును నిరసిస్తూ ఆం దోళనలు చేశారు. అతనిపేరు చెబితే ఆ పార్టీ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఒంటికాలిపై లేచేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విరుచుకుపడ్డారు.  అటువంటి సంస్కృతిని సహించనని పరోక్షంగా హెచ్చరించారు. కానీ ఆ పార్టీ నేతలు కనీసం వినిపించుకోలేదు. షాడోనేతను మించి దందా చేస్తున్నారు. జిల్లాలో భారీ మంచినీటి పథకాల నిర్వహణ పనులను వాటాలేసుకుని పంచేసుకుంటున్న వ్యవహారమే ఇందుకు ఉదాహరణ.  

 

 మొన్న రామతీర్థం...నేడు మరో ఐదు ప్రాజెక్టులు

 మొన్నటికి మొన్న రామతీర్థం మంచినీటి పథకాన్ని ఓ టీడీపీ నేతకు అధికారులు ధారాదత్తం చేశారు. తాజాగా చీపురుపల్లి సుజలధార, భోగాపురం, గొట్లాం, గోస్త నీ, గెడ్డపువలస ప్రాజెక్టులను కూడా ఇదే తరహాలో అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టారు. ఇందులో చీపురుపల్లి సుజలధారనే తీసుకుంటే దాని నిర్వహణ పను ల విలువ రూ.3.44కోట్లు. సాధారణంగా లక్ష రూపాయలు దాటితే టెండర్లు పిలవా లి. అనుభవం ఉండి, తక్కువ కోట్‌చేసిన వారికి అప్పగించాలి. కానీరూ.కోట్లలో ఉన్న పథకాలను సైతం టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులకే వీటిని అప్పగించారు. మిగతా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ఇచ్చేసేందుకు అధికారులు సిద్ధంగాఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి.

 

 నిర్వహణ అంతే సంగతులు

 నామినేటేడ్ పద్ధతిలో ఉదారంగా అప్పగించిన మంచినీటి పథకాల నిర్వహణ  గాలిలో దీపంలా మారనుంది. ప్రస్తుతం పనులు దక్కించుకున్న వారికి ఏమాత్రం అనుభవం లేదు. తాగునీటిని సక్రమంగా అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు తగు మోతాదులో క్లోరినేషన్ చేయాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.   అనుభవం లేని నిర్వాహకులతో ఎప్పుడే సమస్య వస్తుందోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.పోనీ, అధికారులేమైనా చేయగలరా అంటే అదీ డౌటే. ఒత్తిళ్లకు లొంగిపోయి పను లు అప్పగించిన అధికారులు వారిని ఏం ప్రశ్నించగలరనే వాదన విన్పిస్తోంది.

 నామినేటెడ్‌గా అప్పగించాంభారీ మంచినీటి పథకాలను నామినేటేడ్ పద్ధతిలో అప్పగిస్తున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మెహెర్ ప్రసాద్ తెలి పారు. తాజాగా మూడు ప్రాజెక్టులను ఇవ్వగా, మరికొన్ని ప్రాజెక్టులిచ్చేందు కు ఫైలు నడుస్తుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top