‘పోలీసులతో కొట్టిస్తామని భయపెట్టారు’

‘పోలీసులతో కొట్టిస్తామని భయపెట్టారు’ - Sakshi


విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం తమను భయపెట్టి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆరోపించారు. టీడీపీ నాయకులు రికార్డులు తారుమారు చేసి అసైన్డ్‌ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని పేదలు వాపోయారు. సేవ్‌ విశాఖ పేరుతో వైఎస్సార్‌సీపీ గురువారం నిర‍్వహించిన మహాధర్నాకు హాజరైన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులు, పేదలతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయాలను తెలుసుకున్నారు. వారి తరపున గట్టిగా పోరాడతామని భరోసాయిచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని హామీయిచ్చారు.



గణేశ్‌ (గోవిందపురం గ్రామం):

సరిగ్గా ఏడాది భూదళారిలు వచ్చి భూములు లాక్కునే ప్రయత్నం చేశారు

ల్యాండ్‌ పూలింగ్‌లో మీ భూములు ఉన్నాయని మమ్మల్ని భయపెట్టారు

ఇవి అసైన్డ్‌ భూములు కాబట్టి ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరించారు.

1972, 1983, 1997లో ప్రభుత్వం 450 దాదాపు ఎకరాల భూమి పేదలకు ఇచ్చింది

టీడీపీ నేతలు రూపాయి ఆశపెట్టి రూ. 100 తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు

మమ్మల్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోము, ప్రభుత్వంపై పోరాటం చేస్తాం



వరలక్ష్మి(ముదపాక):

రూ. 10 లక్షలకు మా భూములు అమ్మాలని అధికార పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చారు

భూములు అమ్మబోమని చెప్పడంతో మాపై కక్ష కట్టారు

మా భూముల్లో చెట్లు నరికించి  రాత్రికిరాత్రే రోడ్లు వేశారు

మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు



వెంకట్(జేపీ అగ్రహారం):

మా ప్రాంతంలో రైతులకు తెలియకుండానే రికార్డులు తారుమారు చేసి భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు

పట్టా భూముల్లో 450 మంది వ్యవసాయం చేస్తున్నారు

మా పేరుమీదున్న భూములు వాళ్ల పేరు మీద మార్చుకున్నారు

ఇదేంటని నిలదీస్తే ఎకరానికి రూ.10 లక్షలు ఎదురు ఇమ్మని డిమాండ్‌ చేస్తున్నారు

ఈ భూములను పీసీపీఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ కింద పెట్టి పరిహారం కొట్టాలయాలని ప్లాన్‌ వేశారు

డబ్బులు ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిస్తామని భయపెడుతున్నారు

మహాధర్నాతోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చా

మా తరపున పోరాటం చేస్తున్న జగనన్నకు ధన్యవాదాలు



అబ్దుల్‌ ఖాదర్‌ భాషా(గాజువాక):

నేను సైన్యంలో పనిచేసి వచ్చాను

నాకు వెంకన్నపాలెంలో 3 ఎకరాల భూమి 2005లో ఇచ్చారు

ఇందులో కొంత స్థలాన్ని వేరే వాళ్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారు

అధి​కారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

విశాఖ కలెక్టరేట్‌లో అవినీతి రాజ్యమేలుతోంది


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top