విత్తనంపై పెత్తనం!


శ్రీకాకుళం పాతబస్టాండ్‌/పీఎన్‌కాలనీ: జిల్లాలో గ్రామస్థాయి నాయకులు విత్తనంపై పెత్తనం చెలాయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. ఆదుకోవాల్సిన నేతలు నిద్ర నటిస్తున్నారు... వెరసి అన్నదాతకు ఖరీఫ్‌ ఆరంభంలో విత్తు విపత్తు ఎదురైంది. వెబ్‌ల్యాండ్‌ ఇబ్బందులతో విత్తనాల పంపిణీ సక్రమంగా జరగక, ప్రైవేటు రం గంలో మేలురకం విత్తనాలు లభించక రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. రుతుపవనాలు కనికరించినా సర్కారు అనుకూలంగా లేకపోవడంతో విత్తనం కోసం రైతు పాట్లు పడాల్సి వస్తోంది.



వేధిస్తున్న వెబ్‌ల్యాండ్‌

ఈ ఏడాది రైతులకు విత్తనాలు అందించేందుకు వెబ్‌ల్యాండ్‌తో లింకు పె ట్టారు. ఈ వెబ్‌ల్యాండ్‌లో రైతు ల వివరాలు తప్పనిసరిగా కని పించాలి. వేలిముద్ర వేస్తే తప్ప విత్తనాలు కూడా అందవు. అయితే పది రోజులుగా వెబ్‌ల్యాండ్‌ సక్రమంగా పని చేయడం లేదు. సరైన సమయానికి సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. ఒక గంటలో జరగాల్సిన పనికి రో జుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వెబ్‌ ల్యాండ్‌లో సమస్యలు ఉన్నాయని ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అమరావతి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు సైతం విసిగిపోతున్నారు.



అడిగింది కొండంత...

జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు పొలం ప నుల్లో బిజీగా ఉన్నారు. 2.51 హెక్టార్లలో వరి సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది సాగు ఆధారంగా 58 వేల క్వింటాళ్ల విత్తనాలు ముందుగానే పంపిణీ చేయాలి. కా నీ ప్రభుత్వం మాత్రం 37 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేసింది. అవి కూడా రైతులు కోరుకున్నవి కావు. అవసరం లేని వంగడాలను సరఫరా చేశారు. జిల్లాలో రైతులు ఎక్కువగా కొరుకొనే వరి విత్తనాలు 1001, సాంబ మసూరి, సోనా మసూరి, 1075, స్వర్ణ రకాలు. జిల్లాలో ఉన్న నేలలో ఈ వంగడాలు ఎక్కువ దిగుబడినిస్తాయి. కానీ ఇవి ఆశిం చిన మొత్తంలో రాలేదు.



దీంతో కొంతమంది రైతులు ప్రై వేటు వ్యాపారుల బారిన పడుతున్నారు. ఉదాహరణకు 1001 విత్తనాలు 29వేల క్వింటాళ్లు ఇండెంట్‌ పెడితే, 19, 845 క్వింటాళ్లు వచ్చాయి. సోనా మసూరి వెయ్యి క్వింటాళ్లు కావాలని ఇండెంటు పెడితే, 340 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. ఇలా అన్ని రకాల్లోనూ కొరత ఉంది. ఈ విత్తనాలు అన్ని మండలాల్లోనూ అందజేస్తున్నారు. జిల్లాలో 51 ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, 13 డీసీఎంఎస్‌ల్లోనూ, ఒక జీసీసీలో ఈ విత్తనాలు పంíపిణీ చేస్తున్నారు.



సగం కూడా అందలేదు..

విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 37 వేలు క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు వస్తే ఇప్పటివరకు 11 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈ ఏడాది బయట మార్కెట్‌కి, రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాల ధరల్లో పెద్దగా తేడా లేకపోవడం, అధికార పార్టీ కార్యకర్తల పెద్దరికం, కావా     ల్సిన రకం వంగడాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రైతులు ప్రైవేటు మార్కెట్‌లో ఉన్న విత్తనాలను కొంటున్నారు. నాసిరకమే అయినా రైతుకు గత్యంతరం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top