కన్నీరే మిగిలింది

కన్నీరే మిగిలింది


అకాల వర్షం.. అనుకోని రీతిలో గాలులు కలిపి రైతుల ఆశలు ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి మరో పది రోజుల్లో పంట అందుకుందా మని ఆశ పడిన రైతును నిలువునా ముంచేశాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పడిన వర్షానికి, వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల తోటలు చాలా చోట్ల పాడైపోయాయి. అప్పులు చేసి మరీ పంటకు మదుపులు పెట్టామని, ప్రకృతి వైపరీత్యానికి ఇలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.  



రణస్థలం: అకాల వర్షాలు, ఈదురుగాలులకు వాణిజ్య పంటలు నాశనమైపోయాయి. రణస్థలం వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. శుక్రవారం వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి, మిరప వంటి వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని సీతంవలస, రావాడ, రణస్థలం, కోష్ట, బంటుపల్లి, లంకపేట, వెంకట్రావుపేట, పాతర్లపల్లి వంటి గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మిరప విరిగిపోగా, జీడి, మామిడి రాలిపోయాయి. ఈ అకాల వర్షాలకు సుమారు ఎకరాకు రూ.40వేలు వర కు నష్టపోయామని రైతులు వాపోతున్నారు.  ప్రభుత్వం పూర్తి స్థాయిలో రూణమాఫీ చేయకపోడంతో పంట వేసిన తరువాత అప్పులు చేసి మదుపులు పెడుతున్నామని చివరకు తీర్చేందుకు కూడా ఫలసాయం రావడం లేదని తెలిపారు.



సర్వే చేస్తున్నాం: అకాల వర్షాల వల్ల సుమారు 350 హెక్టార్లలో మొక్కజొన్న నేలకొరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నాం. రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. --- సీహెచ్‌ కార్తీక సుధ, వ్యవసాయాధికారి, రణస్థలం



పూర్తిగా నష్టపోయా: మొక్కజొన్న 2 ఎకరాలు, మిరప 50 సెంట్లలో వేశాను. ఈ పెను గాలులకు పంటలు పూర్తిగా పాడైపోయి నష్టపోయాను. --- కోల దుర్గారావు, రైతు



ప్రభుత్వమే ఆదుకోవాలి: మొక్కజొన్న 2.50 ఎకరాలు, మిరప 75 సెంట్ల వరకు సాగు చేస్తున్నాను. ఈదురుగాలుల కు మిరప పిందె కూడా చేతికి రాకుండా మొత్తం పోయింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. --- మాత రామారావు, రైతు



రైతన్న కంట నీరు

పొందూరు : మండలంలో శుక్రవారం కురిసిన అ కాల వడగళ్ల వర్షానికి పంటలు నాశనమయ్యాయి. ఉద్యానవన, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో రైతన్నలు కన్నీ టి పర్యంతమవుతున్నారు. మండలంలోని బాణాం, తానెం, దళ్లిపేట, రెడ్డిపేట, కంచరాం, లోలుగు, తం డ్యాం, మీసాలపేట, బొట్లపేట, మన్నెపేట గ్రామాల్లో ఉద్యానవన పంటలు,  మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. బాణాం, దళ్లిపేట, లోలుగు, తండ్యాం పంచాయతీల్లో మొక్కజొన్న సుమారు 750 ఎకరాల్లో నాశనమైంది. సుమారుగా మిరప– 300 ఎకరాలు, అరటి– 50 ఎకరాలు, వంగ–20 ఎకరాల్లోను నాశనమైంది. బొట్లపేటకు చెందిన రైతులు నాగేశ్వరరావు, ఉప్పలపాటి ధనుంజయలక్ష్మి, మన్నె హైమావతి, బొట్ల సూర్యనారాయణ, సీతారాం, వాండ్రంగి గ్రామానికి చెందిన మేక సుందరనారాయణమ్మ తదితరులకు చెందిన మిరప పంట ధ్వంసమైంది. బాణాంలో మునకాల సత్యం, కొల్లి సత్యనారాయణ తదితరులకు చెందిన బొప్పాయి పంటలు నేలకొరిగాయి.



సుమారు 5 ఎకరాల్లో అరటి తోట పువ్వు, కాయ దశలో ఉండగా వడగళ్ల వానకు నేలకొరిగింది. దీంతో పాటు మిరప, బొప్పాయి, వంగ తది తర పంటలు వందల ఎకరాల్లో నాశనమయ్యాయి. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. వారి కష్టం, అప్పు మాత్రమే మిగిలింది. --- పెద్దింటి వెంకటరవిబాబు, సర్పంచ్, బాణాం





చేతికొచ్చిన బొప్పాయి పంట చేజారిపోయింది. వడగళ్ల వానకు కాయలు పక్వానికి రాకుండానే రాలపోయాయి. అమ్మితే కొనేవారు కూడా ఉండరు. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. --- మునకాల సత్యం, బొప్పాయి రైతు, బాణాం.        



తండ్యాం, మీసాల పేట, బొట్లపేట గ్రామాల్లో వేసిన సుమారు 2 ఎకరాల్లో వం గపంట నాశనమైంది. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాం. పిందెæ దశలో ఉండగా పంట మొత్తం నేలకొరిగింది. --- మీసాల రమణబాబు, మీసాల పేట, రైతు



నేలమట్టమైన పంటలు

లావేరు : మండలంలో శుక్రవారం రాత్రి వడగళ్ల వానతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో మండలంలోని మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. అలాగే మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి. మండలంలోని కేశవరాయుని పురం, లావేటిపాలేం, లావేరు, సీతంవలస, రామునిపాలేం, తాళ్లవలస, గుమడాం, గోవిందపురం, ఇజ్జాడపాలేం, లింగాలవలస, పోతయ్యవలస, లుకలాపుపేట, కొత్తకోట, అదపాక, బెజ్జిపురం, రావివలస, గుమడాం, బుడతవలస, వేణుగోపాలపురం, నాగంపాలేం గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న పంట ఈదురుగాలులకు బలైపోయింది. అలాగే మండలంలోని పిడుగుపాలేం, లావేటిపాలేం, అప్పాపురం, వెంకటాపురం గ్రామాలతో పా టు మరికొన్ని గ్రామాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. వీటితో పాటు మామిడి కాయలు కూ డా చాలా వరకు రాలిపోయాయి. నాలుగు రోజుల కిందట పడిన అకాల వర్షానికి కొం త మొక్కజొన్న పంట నేలమట్టం అవ్వగా శుక్రవారం వీచిన గాలులకు మొత్తం ఒరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అ«ధికారులు, పాలకులు పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.



జి.సిగడాంలో..:  మండలంలో శనివారం కురిసిన వర్షానికి, వీచిన భారీ గాలులకు రైతు నిలువునా మునిగిపోయాడు. వాండ్రంగి గ్రామంలో చింత సింహాచలం అనే వ్యక్తికి సం బంధించి రూ.1.80 లక్షల విలువ చేసే నూర్పు యంత్రంపై భారీ చెట్టుపడి యంత్రం నాశనమైపోయింది. అదే గ్రామానికి చెందిన మన్నె లక్ష్మిదొరకు చెందిన ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. గ్రామంలో మొక్కజొన్న, మిరప, జీడి, మామిడి తోటలు 25 ఎకరాల వరకు నాశనమయ్యాయని సర్పంచ్‌ బీవీ రమణ తెలిపారు. ఉల్లివలస, వెంకయ్యపేట, బాతువ గ్రామాల్లో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి తక్షణమే నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే జరిపి బాధితులను అదుకోవాలని కోరుతున్నారు.



కొంప ముంచిన వర్షం:

రాజాం రూరల్‌ : అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో అకాల వర్షంతో పాటు ఈదురుగాలుల కారణంగా కోత దశలో ఉన్న మొక్కజొన్న పంటలు పొగిరి, పొనుగుటివలస, శ్యాంపురం తదితర ప్రాంతాల్లో పంట పూర్తిగా పాడైపోయింది. ఈ ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట నేలకొరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. రాజాం తో పాటు పరిసర మండలాల్లో పూత దశలో ఉన్న మామిడి పిందెలు నేలకొరిగాయి. దీంతో ఈ పంటలను కౌలుకు తీసుకు న్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల పంటపొలాల మీదుగా నీరు ప్రవహించింది.



కూలిపోయిన షెడ్‌లు, పొందూరు: మండలంలోని శుక్రవారం కురి సిన వడగళ్ల వానకు పలు రేకుల షెడ్‌లు విరి గిపోయాయి. బొట్లపేట, తండ్యాం మెట్ట, ఎ రుకల పేటల్లో రేకుల షెడ్‌లు ఎగిరిపోయి చె ల్లాచెదురైపోయాయి. బొట్లపేటలో రైతు ఉ ప్పిలి బుల్లిరాజుకు చెందిన ఆవుల షెడ్, వ్యవసాయ పనిముట్లు పెట్టుకొనే షెడ్‌పై రేకులు పూర్తిగా విరిగిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. తండ్యాం మెట్టకు సమీపంలో ఉన్న మడ్డువలస కాలువ రెండో దశ పనులుకు సంబందించి క్యాంపు ఆఫీసుపై రేకులు విరి గిపోయాయి. ఎరుకలపేట సమీపంలోని హో టల్‌ పైకప్పు పూర్తిగా కూలిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top